నందమూరి నట సింహం మార్కెట్ పరిస్థితేంటో ఇప్పుడు ..!

40

నందమూరి నట సింహం బాల‌కృష్ణ సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ లో గాని ప్రేక్షకుల్లో గాని భారీగా క్రేజ్ ఉండేది. సమర సింహా రెడ్డి, నరసింహ నాయుడు, లక్ష్మీ నరసింహ వంటి చిత్రాలతో భారీ విజయాలను అందుకున్నాడు. మధ్యలో కొన్ని ఫ్లాప్స్ వచ్చినా బోయపాటి శ్రీను తెరకెక్కించిన సింహ, లెజెండ్ చిత్రాలతో కం బ్యాక్ అయ్యారు బాలయ్య. కానీ మళ్ళీ ఈ మ‌ధ్య కాలంలో ఫాం ని కోల్పోయారు. వరుసబెట్టి బాలయ్య సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్స్ గా మిగులుతున్నాయి.

 

దీంతో బాలయ్య మార్కెట్ కూడా బాగా పడిపోయింది. అంతేకాదు ఒకప్పుడు బాలయ్య సినిమాలో ఛాన్స్ అంటే హీరోయిన్స్ ఒకరిని మించి ఒకరు పోటీ పడి మరి వచ్చేవారు. అలాంటిది ప్రస్తుతం బాలయ్య ఫ్లాప్స్ లో ఉన్నందున, అదీ గాక ఆయన ఏజ్ దృష్ఠ్యా రెండు మూడు సినిమాలలో నటించిన హీరోయిన్స్ కూడా ఓకే చెప్పడం లేదు. అందుకే కె.ఎస్.రవికుమార్ – బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన ‘రూలర్’ సినిమా కి సరైన హీరోయిన్ దొరక్క వేదిక, సోనాల్ చౌహాన్ లాంటి అవుట్ డేటెడ్ హీరోయిన్స్ ని తీసుకున్నారు. ఎటు సినిమా పోయింది కాబట్టి హీరోయిన్స్ గురించి ఎవరు చర్చించుకోలేదు.

ఇక బాలయ్య, బోయపాటి శ్రీను హ్యాట్రిక్ హిట్ కోసం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసందే. ఈ సినిమాకి బాలయ్య సరసన నటించే హీరోయిన్ విషయంలో సమస్య వచ్చింది. ముందు కీర్తి సురేష్ అన్నారు. ఆ తర్వాత త్రిష అన్నారు. మరోసారి నయనతార పేరు తెరమీదకొచ్చింది. అయితే వీళ్ళెవరూ బాలయ్య సరసన సినిమా చేయడానికి సాహసించలేదు. దీంతో బాలయ్య, బోయపాటికి శ్రియ నే ఫైనల్ ఆప్షన్ అయిందని తాజా సమాచారం. అయితే శ్రియ కూడా అవుట్ డేటెడ్ హీరోయిన్ అనే చెప్పాలి. ఈవిడ వల్ల సినిమాకి ప్లస్ అయ్యో అవకాశం లేదని చెప్పాలి. మరి ఇలాంటి నేపథ్యంలో బాలయ్య కి హీరోయిన్ ని సెట్ చేసే విషయంలో బాలయ్యకి ఆయనతో సినిమా తీసే దర్శకుడికే పట్ట పగలే చుక్కలు కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే బాలయ్య రేంజ్ ఎంతగా దిగజారిపోయిందో అర్థమవుతుంది.