జగన్ కోడి కత్తి కేసు.. ఎన్ఐఏ కోర్టు కీలక ఆదేశాలు.. రహస్యంగా విచారించండి…!

-

వైఎస్సాఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పై వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో కోడి కత్తితో జరిగిన దాడి కేసుపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. కోడి కత్తి కేసుపై ఎన్ఐఏ చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ దర్యాప్తుపై తాజాగా ఎన్ఐఏ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును రహస్యంగా విచారించాలని… విచారణకు సంబంధించిన వివరాలు మీడియాకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించకూడదని.. మీడియా కూడా విచారణకు సంబంధించిన వివరాలు ప్రచురించకూడదని ఆదేశాలు జారీ చేసింది.

ఈ కేసులోని నిందితులు, న్యాయవాదుల సెక్యూరిటీ కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు కోర్టు వెల్లడించింది. అయితే.. ఈ కేసును ఏపీ ప్రభుత్వం కావాలని తప్పుదోవ పట్టిస్తున్నదని.. అందుకే దీన్ని జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించాలని అప్పట్లో వైసీపీ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ను విచారించిన హైకోర్టు జాతీయ సంస్థలకు ఈ కేసును అప్పగించవచ్చని తీర్పునిచ్చింది. దీంతో ఆ కేసు ఎన్ఐఏకు బదిలీ అయింది.

దీనిపై ఏపీ ప్రభుత్వం కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. కోడి కత్తి కేసును ఎన్ఐఏకు అప్పగించమేంటని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దానిపై ఏపీ ప్రభుత్వం కూడా హైకోర్టును ఆశ్రయించినప్పటికీ… హైకోర్టు మాత్రం ఈ కేసును ఎన్ఐఏకే అప్పగించాలంటూ ఏపీ ప్రభుత్వం వాదనను తోసిపుచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version