లిస్ట్‌లో నో ప్లేస్..ఏం చేద్దాం.?

-

మరి కొన్ని గంటల్లో బి‌ఆర్‌ఎస్ అభ్యర్ధుల లిస్ట్ విడుదల కానుంది..వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అయితే లిస్ట్ విడుదల చేస్తున్నట్లు బి‌ఆర్‌ఎస్ అధిష్టానం నుంచి అధికారికంగా ప్రకటన ఇంకా రాలేదు. కానీ ఈరోజు ముహూర్తం బాగుందని, అందుకే కే‌సి‌ఆర్ లిస్ట్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. గత ఎన్నికల్లో 105 మందితో కే‌సి‌ఆర్ మొదట లిస్ట్ విడుదల చేశారు.

ఈ సారి ఎంతమందితో విడుదల చేస్తారనేది సస్పెన్స్ గా ఉంది.ఇప్పటికే అభ్యర్ధుల ఎంపికపై కే‌సి‌ఆర్ నిర్ణయం తీసుకున్నారని, ఇంకా మొదట లిస్ట్ రావడమే తరువాయి అని తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు లేదని అధికారికంగా చెప్పేసినట్లు తెలిసింది. దీంతో ఆయా ఎమ్మెల్యేలు ఆందోళనలో ఉన్నారు. అటు తమ ఎమ్మెల్యేలకు సీటు ఇవ్వాలని అనుచరులు గోల చేస్తున్నారు. అలాగే చాలా నియోజకవర్గాల్లో బి‌ఆర్‌ఎస్ నేతలు సీట్ల కోసం పోటీ పడుతున్నారు..తమ అనుచరులతో ఆందోళన చేయిస్తున్నారు.

అయితే ఫస్ట్ లిస్ట్ వచ్చేవరకు తెలియదు..ఎవరికి సీటు దక్కుతుంది..ఎవరికి దక్కదు అనేది..ఇక లిస్ట్ బట్టి..అప్పుడు సీట్లు దక్కని వారు ఏం చేస్తారనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఇప్పటికే కొందరికి మళ్ళీ అధికారంలోకి వస్తే ఏదొక పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది.

ఆ హామీకి ఓకే అనుకుంటే ఆ నేతలు బి‌ఆర్‌ఎస్ లో కొనసాగుతారు. లేదంటే వేరే పార్టీల్లోకి జంప్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో మొదట లిస్ట్ వచ్చాకే అసలు విషయం క్లారిటీ వస్తుంది..బి‌ఆర్‌ఎస్ లో ఎవరికి సీటు దక్కదు…సీటు దక్కని వారు ఏం చేస్తారనేది తెలుస్తోంది.

అటు ఎలాగో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల ఎంపికకు దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఈ నెల 25 వరకు దరఖాస్తులు స్వీకరిస్తుంది..దీంతో బి‌ఆర్‌ఎస్ లో సీటు దక్కని ఎమ్మెల్యేలు..కాంగ్రెస్ వైపు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. చూడాలి మరి బి‌ఆర్‌ఎస్ మొదట లిస్ట్ ఎలా ఉంటుందో.

Read more RELATED
Recommended to you

Latest news