ఎడిట్ నోట్: ఎన్నికల శంఖారావం..!

-

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన పార్టీలు ఎన్నికల శంఖారావం పూరించడానికి రెడీగా ఉన్నాయి. ఇప్పటికే అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీ ఈ విషయంలో ఓ అడుగు ముందుంది. ఇప్పటికే కే‌సి‌ఆర్..సూర్యాపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభించి..ఎన్నికల శంఖారావం పూరించారు. ఎన్నికలే లక్ష్యంగా ఆయన స్పీచ్ కొనసాగింది. ఈ 9 ఏళ్ల తమ పాలంలో తెలంగాణ అభివృద్ధి పథంలో నడిచింది అనే విధంగా కే‌సి‌ఆర్ చెప్పుకొచ్చారు.

ఏ ఏ కార్యక్రమాలు తమ పాలనలో జరిగాయి…ఇక వేరే పార్టీ గాని అధికారంలోకి వస్తే తెలంగాణ అభివృద్ధికి బ్రేకు పడతాయనే విధంగా మాట్లాడారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై కే‌సి‌ఆర్ మాట్లాడారు. ఇక రాజకీయంగా మళ్ళీ తమకు అవకాశం ఇవ్వాలని, అప్పుడే తెలంగాణ ఇంకా ముందుకు పోతుందనే విధంగా కే‌సి‌ఆర్ చెప్పుకొచ్చారు. ఇక కాంగ్రెస్ పై ఎక్కువ విమర్శలు చేశారు. ఎందుకంటే ప్రధాన పోటీ ఆ పార్టీ నుంచే ఎదురవుతుంది. గత ఎన్నికల కంటే ఈసారి ఓ ఐదారు సీట్లు ఎక్కువే గెలుస్తామని కే‌సి‌ఆర్ చెప్పుకొచ్చారు.

ఇక కొన్ని గంటల్లోనే బి‌ఆర్‌ఎస్ అభ్యర్ధుల మొదట లిస్ట్ కూడా విడుదల కానుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అభ్యర్ధుల ఎంపికకు దరఖాస్తుల స్వీకరణ చేపట్టిన విషయం తెలిసిందే. అలాగే మల్లిఖార్జున్ ఖర్గేని తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్  ప్రకటించి..ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. అటు బి‌జే‌పి సైతం ఎన్నికల రంగంలోకి దిగింది. ఈ క్రమంలోనే ఈ నెల 27న ఖమ్మంలో భారీ సభకు ప్లాన్ చేశారు.

ఈ సభకు అమిత్ షా వస్తున్నారు. ఆ తర్వాత బి‌జే‌పి అభ్యర్ధుల మొదట లిస్ట్ విడుదల కానుంది. ఇలా మూడు ప్రధాన పార్టీలు ఎన్నికల శంఖారావం పూరించనున్నాయి. ఇక ఎన్నికల షెడ్యూల్ రాకముందే అభ్యర్ధులని కూడా ప్రకటించి దూకుడుగా ఉండాలని చూస్తున్నాయి. మరి ఈ సారి ఎన్నికల సమరంలో ఎవరు పై చేయి సాధించి అధికారం సొంతం చేసుకుంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news