కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగాల్లో ప్ర‌తి 5లో ఒక‌టి ఖాళీ.. వాటి సంగ‌తేంటి : మంత్రి హ‌రీష్ రావు

-

తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయాల‌ని డిమాండ్ చేస్తూ.. రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ఈ రోజు నిరుద్యోగ దీక్ష చేప‌ట్టారు. ఈ దీక్ష పై తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు ట్విట్ట‌ర్ వేదిక గా స్పందించారు. అంతే కాకుండా బండి సంజ‌య్ పై ప‌లు విమ‌ర్శ‌లు గుప్పించారు. అలాగే కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగాల్లో ప్ర‌తి ఐదింటిలో ఒక‌టి ఖాళీగానే ఉంద‌ని అన్నారు. వాటి సంగ‌తి ఎంటి అని బండి సంజ‌య్ ను ప్ర‌శ్నించారు.

harish rao | హరీష్ రావు

అలాగే కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌ల్లో ప్ర‌స్తుతం 8,72,243 ఉద్యోగాలు ఖాళీ గా ఉన్నాయ‌ని స్వ‌యంగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ 2021 జులై నెల‌లో తెలిపాడ‌ని అన్నారు. అయితే ఆ ఉద్యోగాల‌ను కేంద్ర ప్ర‌భుత్వం భ‌ర్తీ ఎందుకు చేయ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. దేశం కోసం ధ‌ర్మం కోసం కేంద్ర ప్ర‌భుత్వం వెంట‌నే ఆ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయాల‌ని డిమాండ్ చేశారు. కాగ నేడు నిరుద్యోగ దీక్ష చేసిన బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ఉద్యోగాల భ‌ర్తీ విష‌యంలో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం పై ప‌లు ఆరోప‌ణ‌లు చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news