కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం నైట్ కర్ఫ్యూలను విధిస్తున్నాయి. ముఖ్యంగా నూతన సంవత్సర వేడుకులపై దృష్టి సారించాయి. వేల మంది గుమ్మిగూడే అవకాశం ఉండటంతో ఆంక్షలు విధించడానికి సన్నద్ధమవుతున్నాయి. డిసెంబర్ 31కు అటు ఇటు నాలుగురోజులపాటు నైట్ కర్ఫ్యూను విధిస్తున్నాయి.
దేశంలో అత్యధిక ఒమిక్రాన్ కేసులు నమోదైన న్యూఢిల్లీలో నేటి(సోమవారం) నుంచి నైట్ కర్ఫ్యూ అమలులోకి రానున్నది. తాజా కేరళ రాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా డిసెంబర్ 31 సెలబ్రేషన్స్‌ను అడ్డుకునేందుకు నైట్ కర్ఫ్యూ చర్యలకు ఉపక్రమించింది. డిసెంబర్ 30 నుంచి జనవరి 2 వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుందని, డిసెంబర్ 31న రాత్రి 10గంటల తర్వాత ఎలాంటి సెలబ్రేషన్స్ జరపుకూడదని స్పష్టం చేసింది.