చిరిగిన బట్టలు వేసుకుని ఉద్యమం చెయ్యాలా…?: పవన్ ఫైర్

అమరావతి పరిరక్షణ సమితి నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు నేతలు సమస్యలను వివరించారు. అమరావతి ఉద్యమం చేస్తున్న వారిపై అధికార పార్టీ నేతలు చేస్తున్న కామెంట్స్ సరికాదు అని ఆయన వ్యాఖ్యానించారు. మంచి బట్టలు కట్టుకోవడం, బంగారం పెట్టుకుని ఉద్యమం చెయ్యకూడదా..? అని ప్రశ్నించారు. ఉద్యమం అంటే చిరిగిన బట్టలు వేసుకునే ఉండాలా..? అని నిలదీశారు.

ఉద్యమానికి సామాజిక వర్గానికి ముడిపెట్టడం మంచిది కాదు అని మండిపడ్డారు. దీన్ని మూడు ప్రాంతాల మధ్య సమస్యగా మార్చేశారు అని విమర్శించారు. అమరావతి రైతులకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేసారు. రైతులకు న్యాయం చేసే విషయంలో జనసేన వెనకడుగు వెయ్యదన్నారు. బీజేపీ కూడా అమరావతినే రాజధానిగా చూస్తుంది. దీనిపై నాకు డిక్లరేషన్ కూడా ఇచ్చారని పేర్కొన్నారు. ఏది పడితే అది మాట్లాడుతూ.. రాజధాని అంశాన్ని జఠిలం‌ చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి నుండి రాజధాని తరలిస్తున్నామని అధికారికంగా ప్రభుత్వం చెప్పలేదని… ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన తరువాత జనసేన ఏమి చేస్తుందో చెప్తా అని పేర్కొన్నారు.