ఇక చాలు.. కాపులారా పిడికిలి బిగించండి – హరిరామ జోగయ్య

-

ఇన్నాళ్లు ఓ లెక్క ఇకనుంచి ఓ లెక్క అంటున్నాడు కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్ష్యులు హరిరామ జోగయ్య. ఆయన ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చిందంటే…. పవన్ కళ్యాణ్ పై కాపులు పెట్టుకున్న నమ్మకాన్ని నేల పాలు చేసాడు.అప్పట్లో వంగవీటి రంగా కాపుల గురింపు కోసం పోరాటాలు చేశారు. అంతటి నమ్మకాన్ని మళ్లీ పవన్ పైనే పెట్టుకున్నామని జోగయ్య మాటల్లోని అంతరార్థం. ఇటీవల రాజకీయాలు,సామాజిక పరిణామాలు చూస్తూoటే బాధ కలుగుతోందంటూ ఓ లేఖను ఆయన విడుదల చేసారు.

ఇన్నాళ్లు కాపు సామాజిక వర్గాన్ని అన్ని రాజకీయ పార్టీలు కరివేపాకులా వాడుకున్నాయని ఆయన ఆవేదన చెందారు. మరోసారి చంద్రబాబు చేతుల్లో కాపులు మోసపోవడానికి సిద్ధంగా లేరని అంటున్నారు. వంగవీటి రంగా తరువాత పెద్ద స్థాయిలో కాపులకు అండగా నిలబడతాడని అనుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు చంద్రబాబు పంచన చేరడం కాపులకు తీవ్రమైన అవమానమని లేఖలో జోగయ్య పేర్కొన్నారు. కాపుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు వద్ద పవన్ తాకట్టు పెట్టాడని అసహనం ప్రదర్శించారు. కాపు వర్గానికి ఏదో చేస్తాడని ఇన్నాళ్లు నమ్మామని, కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ప్రతిపక్షాలు చేస్తున్న ప్యాకేజి ఆరోపణలు నిజమనిపిస్తున్నాయని ఆరోపించారు. పొత్తులో ఉన్న పార్టీ గురించి ఆలోచించకుండా కనీసం సంప్రదించకుండా ఐదేళ్ల పాటు సీఎం చంద్రబాబేనని లోకేష్ ప్రకటించడాన్ని తప్పుబట్టారు జోగయ్య.

బాబు అనుమతి లేకుండానే లోకేష్ ఈ కామెంట్ చేశాడా అని జోగయ్య అనుమానాలను నూరి పోస్తున్నారు. కాపుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయయడానికి చంద్రబాబు కుట్ర చేస్తున్నారని జోగయ్య ఆరోపిస్తున్నారు. ఈ విషయమై బహిరంగ లేఖ రాసినా పవన్ కానీ నాదెండ్ల మనోహర్ కానీ స్పందించలేదని తప్పుపడుతున్నారు.ఆలస్యం చేయకుండా కాపులు ఆలోచించుకోవలసిన సమయం వచ్చిందని అంటున్నారు. కాపులు ఒక్కమాటపై నిలబడితే తప్ప రాజకీయంగా న్యాయం జరుగదని,అసలు పవన్ ని నమ్మవద్దంటు బహిరంగ లేఖ ఇచ్చారు జోగయ్య. ఈ వయసులో జోగయ్య స్పీడ్ చూస్తుంటే పవన్ ని ఓ రేంజ్ లో ర్యాగింగ్ చేసినట్టుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news