కాంగ్రెస్‌ లో పెద్దపల్లి, భూపాలపల్లి సీట్ల లొల్లి…రేవంత్‌కు సీన్ లేదా?

-

టి‌పి‌సి‌సి అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి ఎలా దూకుడుగా రాజకీయం చేస్తున్నారో అందరికీ తెలిసిందే…కాంగ్రెస్‌ని బలోపేతం చేయడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అయితే హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితం తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. హుజూరాబాద్‌లో కాంగ్రెస్ ఓడిపోతుందని అంతా అనుకున్నారు…కానీ దారుణంగా ఓడిపోతుందని మాత్రం ఊహించలేదు. దీంతో కాంగ్రెస్‌లో ఒక్కసారిగా పరిస్తితులు మారిపోయాయి.

రేవంత్ రెడ్డి | Revanth Reddy
రేవంత్ రెడ్డి | Revanth Reddy

రేవంత్‌పై సొంత పార్టీ నేతల దాడి పెరిగింది…రేవంత్ టార్గెట్‌గా విమర్శలు చేస్తున్నారు. రేవంత్ వల్లే హుజూరాబాద్‌లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయిందని విమర్శలు వస్తున్నాయి. ఇదే పరిస్తితుల్లో రేవంత్ మాట చెల్లుబాటు అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఈ మధ్య రేవంత్…కొన్ని స్థానాల్లో తన సన్నిహితులకే టిక్కెట్లు ఖరారైనట్లు చెప్పేశారు. పెద్దపల్లి సీటు విజయరమణరావుకు, భూపాలపల్లి సీటు గండ్ర సత్యనారాయణకు ఫిక్స్ అని రేవంత్ చెప్పేశారు.

కానీ దీనిపై కాంగ్రెస్ సీనియర్లు గుర్రుగా ఉన్నారు. రేవంత్ ఎలా సీట్లు ఫిక్స్ చేస్తారని ఫైర్ అవుతున్నారు. భూపాలపల్లి, పెద్దపల్లి కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక ఫైనల్‌ కాలేదని, టిక్కెట్లు ఇచ్చే అర్హత రేవంత్‌కు లేదని పలువురు సీనియర్లు మాట్లాడుతున్నారు. అసలు కాంగ్రెస్‌ పార్టీలో టికెట్లు కేటాయించేది ఏఐసీసీ మాత్రమేనని, రేవంత్‌ టికెట్టు కూడా ఏఐసీసీనే ప్రకటిస్తుందని, అలాంటిది రేవంత్ పెద్దపల్లి, భూపాలపల్లి సీట్లు ఎలా ప్రకటిస్తారని, ఇటీవల జరిగిన కాంగ్రెస్ పోలిటికల్ ఎఫైర్స్ సమావేశంలో సీనియర్ నేతలు ప్రశ్నించారు.

అంటే హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితం ఒక్కసారిగా రేవంత్ని కిందకు లాగేసినట్లే కనిపిస్తోంది. ఇప్పటికే కొందరు సీనియర్లు రేవంత్‌పై గుర్రుగా ఉన్నారు. ఇక హుజూరాబాద్ తర్వాత ఇంకా ఇబ్బంది అయింది. ఇంకా పార్టీలో రేవంత్ మాట చెల్లుబాటు కావడం కాస్త కష్టమయ్యేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news