జూలై 8న వైఎస్సార్ రైతు దినోత్సవంగా నిర్వహించాలని.. ఈ సందర్బంగా రైతు దినోత్సవ కార్యక్రమాలు చేపట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. పార్లమెంట్ నియోజకవర్గానికో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుందని…ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికో వెటర్నరీ అంబులెన్సుల ఏర్పాటుకు కెబినెట్ ఆమోదం తెలిపిందని పేర్ని నాని పేర్కొన్నారు. అలాగే రూ. 89 కోట్లతో వెటర్నరీ అంబులెన్సుల కొనుగోళ్లకు నిర్ణయం తీసుకున్నామని… వైఎస్సార్ బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు.
పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఇళ్ల నిర్మాణానికి సామూహిక శంకుస్థాపనలు చేపట్టనున్నామని.. వచ్చే నెల 1, 3, 4 తేదీల్లో శంకుస్థాపనల స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నామని వెల్లడించారు. అమ్మఒడి, జగనన్న వసతి దీవెన పథక లబ్దిదారులకు ల్యాప్ టాప్ అందించే సౌకర్యం కల్పించేలా కెబినెట్ ఆమోదించిందని… ల్యాప్ టాప్ కావాలని కోరుకున్న వారికి అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
అమ్మఒడి లబ్దిదారుల్లో 34 శాతం మంది ల్యాప్ టాప్ కావాలని కోరారని… ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో యూనివర్శిటీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మధ్య తరగతి ప్రజలకు సొంతిళ్లు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటునట్లు.. జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.