పోప్ ఫ్రాన్సిస్ మృతి నేపథ్యంలో మోడీ సర్కార్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. పోప్ ఫ్రాన్సిస్ మృతి తరుణంలో .. 3 రోజులు సంతాప దినాలు ప్రకటించింది భారత్. ఈ రోజు, రేపు, అంత్యక్రియలు నిర్వహించే రోజు సంతాప దినాలుగా ప్రకటించింది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. ఈ మూడు రోజులు సగం ఎత్తులోనే జాతీయ జెండా ఉంటుంది.

కాగా రోమన్ కాథలిక్ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ ఏప్రిల్ 21న తుదిశ్యాస విడిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన అంత్యక్రియలపై చర్చ జరుగుతోంది. సాధారణంగా పోప్ అంతిమ సంస్కారాలు సంప్రదాయబద్ధంగా జరుగుతాయి. కానీ తాను బతికున్నప్పుడే తన అంత్యక్రియలు ఎలా జరపాలో పోప్ ఫ్రాన్సిస్ సూచించారట. గతంలో మూడు అంచెలున్న శవపేటికలలో పోప్ ను ఖననం చేసే ఆచారం ఉండేది. సింపుల్గా ఉండే.. చెక్క శవపేటికలో తన పార్థివదేహాన్ని ఉంచాలని ఇటీవల ఆయన కోరారట.