షాకింగ్ : చంద్రబాబు వ్యుహకర్తగా.. పీ కే శిష్యుడా..?

-

రాజకీయాల్లో ఇప్పుడు వ్యూహకర్తల ప్రాముఖ్యం పెరిగిపోయింది. ప్రశాంత్ కిషోర్ పుణ్యమా అని ఎన్నికలు కూడా ఓ కెరీర్ గా మారిపోయాయి. ప్రశాంత్ కిశోర్ మొదట్లో నరేంద్ర మోడీకి ప్రచార వ్యూహాలు రూపొందించి సక్సస్ అయ్యాడు. ఆ తర్వాత జగన్ విషయంలో సూపర్ సక్సస్ అయ్యాడు. ఇప్పుడు ఏకంగా ఆయన కూడా జేడీయూలో చేరాడు.

పార్టీలో చేరినా ఆయన కేరీర్ ఆయనదే.. ఆయన ఆ మధ్య తృణమూల్ కాంగ్రెస్ కు కూడా వ్యూహకర్తగా ఉంటాడని వార్తలు వచ్చాయి. అంతే కాదు.. ఏకంగా చంద్రబాబు కూడా ఆయన్ను నియమించు కుందామని అనుకున్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక తాజాగా వినిపిస్తున్న వార్త ఏంటంటే.. చంద్రబాబు ఎన్నికల వ్యూహ కర్తగా ప్రశాంత్ కిషోర్ టీమ్‌ లో పని చేసిన రాబిన్ సింగ్ ను నియమించుకోబోతున్నారట.

ఇందు కోసం రూ. 50 కోట్లతో కాంట్రాక్టు కూడా కుదుర్చుకున్నాడనిఓ పత్రికలో కథనం వచ్చింది. ప్రశాంత్ కిషోర్ టీమ్ లో పని చేసిన రాబిన్ శర్మ.. ఇప్పుడు సొంతంగా ఓ కన్సల్టెన్సీ పెట్టుకుంటున్నాడని తెలుస్తోంది. ఆయన ఇప్పటికే 50, 60 మందితో టీం తయారు చేసుకున్నాడట. ఆ తర్వాత అవసరాన్ని బట్టి విస్తరిస్తాడట.ఆ విషయం తెలిసిన తెలుగు దేశం ఆయన్ను కాంటాక్ట్ అయ్యిందని చెబుతున్నారు.

అయితే ఈ వార్తను ఇంకా నిర్దారించాల్సి ఉంది. ఎందుకంటే.. చంద్రబాబుకు ఇలాంటి కన్సెల్టెన్సీలను నమ్మే అలవాటు లేదు. అంతే కాకుండా ఆయనే సొంతంగా పలు సర్వేలు చేయించుకుంటారు. అందుకు తగిన టీమ్స్ ఆయన వద్ద ఉన్నాయి. అయితే అవి గత ఎన్నికల్లో వర్కవుట్ కానందువల్లే చంద్రబాబు ఈ కొత్త నిర్ణయం తీసుకుని ఉండవచ్చన్నది మరికొందరి అభిప్రాయం. చూద్దాం..ఏదేమైనా కొన్ని రోజుల్లో విషయం తేలకుండా ఉండదు కదా.

Read more RELATED
Recommended to you

Latest news