వ‌రుడు వేట మొద‌లుపెట్టిన స్టార్ హీరోయిన్.. కండీషన్లు ఇవే..

అదా శర్మ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీస్‌లోనే కాదు.. బాలీవుడ్‌లో కూడా న‌టించిన విష‌యం తెలిసిందే. అయితే పెళ్లి కొడుకు వేటలో ఉన్నానంటూ ఓపెన్‌గా ప్ర‌క‌టించింది అదా శ‌ర్మ‌. హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయ‌మైంది. హిట్ సినిమాల్లో నటించినా కూడా అవ‌కాశాలు పెద్ద‌గా ద‌క్క‌లేదు. అయితే అటు కోలీవుడ్‌లోనూ న‌టించింది. ఇక‌ అందాలారబోతకు కూడా హద్దులు చెప్పని ఈ బ్యూటీని ఏ భాషలోనూ స్టార్‌డంను అందుకోలేకపోయింది.

ప్ర‌స్తుతం ఇప్పుడు అదాశర్మ దృష్టి పెళ్లిపైకి మళ్లింది. ఈ క్ర‌మంలోనే త‌న‌కు వ‌రుడు కావాలంటూ ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించింది. పెళ్లి కొడుకు వేటలో ఉన్నాను అంటూ తన ట్విట్టర్‌లో పేర్కొంది. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. వ‌రుడుకు మాత్రం కొన్ని విచిత్ర‌మైన కండిష‌న్లు పెట్టింది. అవేంటో కూడా ఆదాశర్మ ఓపెన్‌గా బ‌య‌ట‌పెట్టింది. ముఖ్యంగా ఉల్లిపాయలు తినకూడదు. బయటకు వెళ్లేటప్పుడు మాత్రం ఖ‌చ్చితంగా సంప్రదాయ దుస్తులు ధరించాల్సిందే. మద్యం, మాంసాహారాలు నిషిద్ధం.

జాతి, మతం, రంగు, జాతకం, షూ సైజ్, వీసా, ఈతలో ప్రతిభ, ఇన్‌స్ట్రాగామ్‌ అకౌంట్‌ వంటి వాటి గురించి నాకు అవ‌స‌రం లేదు. అలాగే ముఖ్యంగా నిత్యం చిరునవ్వు ముఖం మీద చెరగకుండా వంట చేయాలి. భారతీయ భాషలన్నింటినీ గౌరవించాలి వంటి నిబంధనలు పాఠించాలని ఆమె పేర్కొంది. ఇది చూసిన నెటిజ‌న్లు ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు. ఏదేమైనా తనకు కాబోయేవాడు ఇలా ఉండాలని ముందుగానే బయట పెట్టేసింది అదా శ‌ర్మ‌.