ఆత్మహత్య చేసుకుంటే క్యారెక్టర్ ను తప్పుబడుతున్నారు: ప్రియాంక గాంధీ

-

కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీలు తెలంగాణ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ మీటింగ్ లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, BRS ప్రభుత్వం వలన ఏమీ లాభం లేదని చెప్పే ప్రయత్నం చేశారు. నీతివంతంగా మిగిలిన ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంలో ఎందుకు అవినీతి చేస్తున్నారంటూ ప్రశ్నించారు ప్రియాంక గాంధీ. ఉద్యోగం కోసం ఆత్మహత్య చేసుకుంటే క్యారెక్టర్ ను తప్పుగా చూపించే ప్రయత్నం చేయడం చాలా దారుణం అంటూ ప్రభుత్వాన్ని ఎండగట్టింది ప్రియాంక గాంధీ. ఇప్పటి వరకు కేసీఆర్ ప్రభుత్వం ఒక్క ప్రభుత్వ యూనివర్సిటీ ని అయినా ఏర్పాటు చేసిందా ? చేసినవన్నీ కూడా ప్రైవేట్ యూనివెర్సిటీలే కావడం చాలా ఆశ్చర్యకరం అంటూ ప్రియాంక గాంధీ మాట్లాడారు. ఒక ఒస్మానియా యూనివర్సిటీ లో ఉన్న ఖాళీలను సైతం భర్తీ చేయలేని దౌర్భాగ్య ప్రభుత్వం ఇది అంటూ కేసీఆర్ పై నిప్పులు చెరిగారు ప్రియాంక.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తే నిరుద్యోగ భృతిని 4 వేలకు పెంచడమే కాకుండా ఆగిపోయిన 2 లక్షల ఉద్యోగాలను ఒకే సంవత్సరం భర్తీ చేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news