నేను సీఎం గా పోటీ చేస్తాను..!

-

దేశంలో యువత రాజకీయాల్లోకి రావడానికి అనుకూలమైన వాతావరణం కనిపిస్తోంది. దేశంలో అన్ని చోట్ల కూడా అన్ని పార్టీల లోనూ యువత రాజకీయాల్లోకి దుసుకువస్తుండటం ఇప్పటికే మనం చూస్తున్నాం. బీహార్‌లోని దర్బంగాలో పెరిగిన పుష్పం ప్రియా చౌదరి తాజాగా లండన్ స్కూల్ ఆఫ్ఎకనామిక్స్ లో చదువుతుంది.ఈమె తను వచ్చే ఎన్నికల్లో బీహార్లోJDUతరపున సీఎం అభ్యర్థిగా పోటీచేయాలనుకుంటున్నట్లు ఒక సంచలనాన్ని సృష్టించింది.

అయితే ఈమె కూడా రాజకీయ నేపధ్యం నుంచి వచ్చారు. యునైటెడ్ జనతాదళ్ (JDU) మాజీ ఎమ్మెల్సీ వినోద్ చౌదరి కూతురు. మహిళా దినోత్సవం రోజున బీహార్‌కు మార్పు అవసరం, బీహార్‌కు రెక్కలు అవసరం, చెత్త రాజకీయాలకు చెక్ పెట్టండి, 2020లో ఎగిరేందుకు, పరిగెత్తేందుకు ప్లూరల్స్‌తో చేతులు కలపండి, ఎందుకంటే బీహార్‌ అభివృద్ధి చెందాలి. ఆ మార్పు సాధ్యమవుతుంది” అని ఆమె చేసిన ప్రకటనకు సోషల్ మీడియా లో మంచి స్పందనే వచ్చింది.

అయితే ప్రస్తుతం బీహార్‌లో బీజేపీ, జేడీయూ, LGPల సంకీర్ణ ప్రభుత్వం నడుస్తుంది. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి గా ఉన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాదే జరగబోతుండటంతో గెలుపు కోసం బీజేపీ ప్రయత్నిస్తున్ది. జేడీయూ తన రేటింగ్ పెంచుకోవడానికి కృషి చేస్తుంది. ప్రశాంత్ కిషోర్ స్వయంగా పార్టీ పెట్టే క్రమంలో ఉన్నారు. ఉద్దండులైన మహ మహ నేతలు ఎన్నికలకు సిద్ధం అవుతున్న ఈ సమయంలో సీఎం గా పోటీ చేస్తాను అంటున్న పుష్పం ప్రియా చౌదరి చేసిన ప్రకటన రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news