వైఎస్ ఫ్యామిలీ అంటే ఆ దేవుడికి ప్రేమ ఎక్కువట.. అందుకనే అలా జరుగుతుందట..!

-

సినీ నటులకే కాదు, రాజకీయ నాయకులకు కూడా సెంటిమెంట్లు ఉంటాయి. ఒక్కో నేతకు ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. ఈ క్రమంలోనే దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి కూడా ఓ సెంటిమెంట్ ఉందట. అదే వరుణ దేవుడు..

సినీ నటులకే కాదు, రాజకీయ నాయకులకు కూడా సెంటిమెంట్లు ఉంటాయి. ఒక్కో నేతకు ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. ఈ క్రమంలోనే దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి కూడా ఓ సెంటిమెంట్ ఉందట. అదే వరుణ దేవుడు.. ఏంటీ వరుణ దేవుడికీ, వైఎస్ ఫ్యామిలీకి ఏంటీ సంబంధం.. అని ఆలోచిస్తున్నారా.. ఏమీ లేదండీ.. గతంలో చంద్రబాబు సమైక్యాంధ్ర సీఎంగా ఉన్నప్పుడు అస్సలు వర్షాలు పడలేదు. కరువు వచ్చింది. ఇక మొన్నీ మధ్య వరకు చంద్రబాబు విభాజ్య ఏపీకి సీఎంగా ఉన్నారు. దీంతో మొన్నటి వరకూ ఏపీలో అసలు వర్షాలు లేవు. కానీ ఇప్పుడు వైఎస్ జగన్ సీఎం అయ్యాక.. ఏపీలో పుష్కలంగా వర్షాలు కురుస్తున్నాయి. అదీ.. అసలు కహానీ..

rain god has faith in ysr an ys jagan

అయితే నిజానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా సమైక్యాంధ్రలో వర్షాలు దండిగానే కురిశాయి. కానీ అదేం విచిత్రమో.. చంద్రబాబు హయాంలో వరుణ దేవుడికి మొహం మొత్తింది కాబోలు.. అస్సలు వర్షాలు పడలేదు. అయితే ఇదే విషయాన్ని వైకాపా రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి కూడా చెబుతున్నారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే…

వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నంత వరకు వర్షాలు పడ్డాయని.. రైతులు సంతోషంగా ఉన్నారని.. కానీ చంద్రబాబు పాలనలో కరువు తాండవం చేసిందని నాగిరెడ్డి అన్నారు. అలాగే ఇప్పుడు జగన్ సీఎంగా ప్రమాణం చేశాక ఆల్మట్టి నుంచి 2.30 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుందని, మరోవైపు ఇప్పుడు ఏపీలో వర్షాలు కూడా సమృద్ధిగానే కురుస్తున్నాయన్నారు. వరుణ దేవుడికి వైఎస్ కుటుంబం అంటే ఇష్టమని, అందుకనే వైఎస్, ఆయన తనయుడు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు మాత్రమే వర్షాలు బాగా పడుతున్నాయని అన్నారు.

ఇక సీఎం జగన్ రైతుల కోసం ఆలోచిస్తున్నారని, అందుకనే పోలవరం ప్రాజెక్టును మొదటి ప్రాధాన్యతగా గుర్తించి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని నాగిరెడ్డి అన్నారు. 1999 నుంచి 2004 వరకు చంద్రబాబు 9 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నా.. పోలవరం మాత్రం దివంగత సీఎం వైఎస్ హయాంలోనే రూపుదిద్దుకుందని తెలిపారు. అందుకనే జగన్ పోలవరంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారన్నారు..!

Read more RELATED
Recommended to you

Latest news