రాజ్యసభ ఎన్నికలు… షెడ్యూల్ విడుదల

-

ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఈ రోజుతో ముగుస్తున్నాయి. ఈనెల 10న ఫలితాలు విడుదల కానున్నాయి. ఇదిలా ఉంటే మరో ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. రాజ్యసభలో ఖాళీ ఉన్న ఎంపీ స్థానాలకు షెడ్యూల్ విడుదలైంది. ఆరు రాష్ట్రాల్లోని ఖాళీ స్థానాలకు ప్రస్తుతం షెడ్యూల్ ఖరారైంది. ఎప్రిల్ నెలలో ఈ రాష్ట్రాల్లో ఎంపీల కాలపరిమితి ముగుస్తోంది.

పార్లమెంట్

6 రాష్ట్రాల్లో మొత్తం 13 రాజ్య సభ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నిక సంఘం ఎన్నికలు జరుపనుంది. దీంట్లో అస్సాంలో 2, హిమాచల్ ప్రదేశ్ లో 1, కేరళలో 3, నాగాలాండ్ లో 1, త్రిపురలో 1, పంజాబ్ లో 5 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. వీటికి ఎన్నికలు జరుగనున్నాయి. మార్చి 21న తేదీన నామినేషన్లు ప్రారంభం కాగా.. మార్చి 24న నామినేషన్ విత్ డ్రాకు గడువు ఉంది. మార్చి 31న పోలింగ్, ఓట్ల లెక్కింపు జరుగనుంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news