రియల్ మోసాలంటున్న మైహోమ్ చానల్ లోగుట్టు ఇదేనా !

మెట్రోపాలిటిన్ సిటీలైన హైదరాబాద్,వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతున్న రియల్ ఎస్టేట్ మోసాల పై సిరీస్ ల వారీగా వరుస కథనాలు ప్రచారం చేసింది ఓ తెలుగు న్యూస్ చానల్. అనుమతులు లేని ప్రీ లాంచ్ వ్యాపారాన్ని బట్టబయలు చేశామంటూ.. రియల్టర్ల ఘరాణా మోసాల పై ఎక్స్ క్లూజివ్ రిపోర్ట్ అంటు నాలుగు రోజులు నానా హడావిడి చేసింది. ఓ ‘రియల్ ఎస్టేట్ ‘ కం కన్ స్ట్రక్షన్ కంపెనీ చేతిలో ఉన్న ఈ చానల్ ఎవరి నోట్లో మట్టికొట్టడానికి ఈ ప్రీలాంచ్ కథనాలు ప్రచారం చేసిందన్న దాని పై రియల్ ఎస్టేట్ వ్యాపార వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది.

స్థిరాస్తి రంగంలో ఎక్కువ నమ్మకం పైనే వ్యాపారాలు జరుగుతాయి. సామన్య,మధ్య తరగతి కుటుంబాలు తమ సొంతింటి కల నేరవేర్చుకోవడం కోసం పైసా పైసా కూడబెట్టి ఆకర్షణియమైన ఆఫర్ల వలలో చిక్కుకుని బిల్డర్లు,రియల్టర్లకు డబ్బులు సమర్పిస్తారు. ఇక ఆ తర్వాత నుంచి వీరికి టార్చర్ మొదలవుతుంది. చెప్పిన చోట కాకుండా మరో చోట్ల ప్లాట్లు,స్థలాలు ఇస్తూ సంవత్సరాలు గడుస్తున్న నిర్మాణాలు పూర్తి చేయకుండా రియల్ మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి చాలా కేసులు రేరా పరిధిలో లేకపోవడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. కొందరు కోర్టులను ఆశ్రయిస్తుండగా కొందరు సెటిల్మెంట్ల కోసం నేతలను ఆశ్రయిస్తున్నారు.

ఈ రియల్ మోసాలన్ని కొత్తగా ఇప్పుడు జరుగుతున్నవి ఏమి కావు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ తతంగం జరుగుతుంది. అయితే ఇప్పటికిప్పుడు ఓ న్యూస్ చానల్ మిన్నువిరిగి మిదపడిందా అన్న రీతిలో హడావిడి చేయడం వెనుక లోగుట్టు ఏమిటన్నదాని పై వ్యాపారవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కొన్ని కంపెనీల వెంచర్లు,ప్రాజెక్టులను ఈ చానల్ టార్గెట్ చేయడం వెనుక నిగూఢమైన రహస్యాలు ఉన్నాయట. తమ మైహోం వ్యాపార సామ్రాజ్యానికి కంటగింపుగా మారిన కొన్ని వ్యాపార సంస్థలను దెబ్బతీయడానికే ఈ ప్రీలాంచ్ కథనాలను ప్రమోట్ చేసిందన్న చర్చ నడుస్తుంది.

ప్రీలాంచ్ మోసాలన్నవి ఉన్నమాట వాస్తవమే అయినా ఆ చానల్ టార్గెట్ మాత్రం కొన్ని కంపెనీలను వ్యాపారపరంగా డ్యామేజ్ చేయడమే అని తెలుస్తుంది. ఈ సంస్థలను దెబ్బ తీయడం ద్వారా రియల్ మార్కెట్లో తమకు ఎదురు లేకుండా చూసుకోవాలన్న ఆశతోనే తమ చేతిలో ఉన్న చానల్ మై హోం బాసులు పని చెప్పినట్లు తెలుస్తుంది. దీనివల్ల వ్యాపార పరంగా ఆ సంస్థలు డ్యామేజ్ అయినా ఆ సంస్థల్లో స్థలాలు,ఇళ్లు కొనుగోలు చేసిన మద్యతరగతి ప్రజలకు మనశ్శాంతి లేకుండా చేసింది సదరు చానల్. ఇక నిన్నటి రోజున ఎంతో ఆడంబరంగా మై హోమ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ మరో శిఖరాన్ని చేరుకుందని. 35 సంవత్సరాల వేడుక అంటు తమ బిజినెస్ ని ప్రమోట్ చేసుకుంది.