కాంగ్రెస్ పార్టీకి రేణుకా చౌదరీ షాక్… టికెట్ ఇవ్వకుంటే రాజీనామా..?

-


దేవుడా.. పార్టీలు మారడం మనం ఇప్పటివరకు ఏపీలో చూశాం. అధికార పార్టీ టీడీపీ నుంచి వైఎస్సార్సీపీకి వలసల రాజ్యం కొనసాగుతోంది. ఇప్పటికే టీడీపీకి చెందిన ముఖ్య నాయకులు వైసీపీలో చేరారు. మరికొందరు చేరడానికి సిద్ధంగా ఉన్నారు. కాసేపు ఏపీ రాజకీయాలను వదిలేసి తెలంగాణకు వెళ్దాము పదండి.

తెలంగాణలో కూడా త్వరలో  లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి కదా. దీంతో తెలంగాణ లోనూ సీట్ల లొల్లి ప్రారంభమయింది. తాజాగా కేంద్ర మాజీ మంత్రి,  కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి కాంగ్రెస్ కు ఝలక్ ఇచ్చారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తనకు ఖమ్మం ఎంపీ సీటు ఇవ్వకుంటే పార్టీకి రాజీనామా చేయడానికి కూడా వెనుకాడబోనని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఆమె గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ కి దూరంగా ఉంటున్నారు. తన రాజకీయ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు ఆమె తన అనుచరులతో భేటీ అయ్యారు. ఖమ్మం ఎంపీ టికెట్ తనకు ఇవ్వకుంటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని ఆమె పార్టీకి అల్టిమేటం కూడా జారీ చేసినట్టు సమాచారం. చూద్దాం దీనిపై కాంగ్రెస్ హై కమాండ్ ఎలా స్పందిస్తుందో?

Read more RELATED
Recommended to you

Exit mobile version