సోనియా గాంధీ, సుష్మా స్వరాజ్, మీరా కుమార్ వల్లే తెలంగాణ వచ్చింది. : రేవంత్ రెడ్డి

-

పరిపాలనలో మహిళలకు సాటి లేరని కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పాటులో కూడా మహిళ పాత్ర మరవలేనిది అని ఆయన అన్నరాు. సోనియాగాంధీ, సుష్మా స్వరాజ్, మీరా కుమార్ గారు తెలంగాణ ఏర్పాటులో వీరి పాత్ర మరవలేనిది అని అన్నారు. దేశంలో క్రీడాకారులుగా రాణించింది.. దేశ ప్రతిష్టను కూడా నిలబెట్టింది మహిళా క్రీడాకారులే అని అన్నారు. సానియా మీర్జీ, సైనా నెహ్వాల్ ఇలా మహిళలు దేశానికి పేరు తీసుకువచ్చారని అన్నారు. స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లను రాజీవ్ గాంధీ తీసుకువచ్చినట్లు వెల్లడించారు. యూపీఏ చైర్ పర్సన్ గా ఉన్నప్పుడు.. రాజ్య సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించి లోక్ సభకు పంపిస్తే ప్రభుత్వం మారిందని… ఎనిమిదేళ్లుగా ఈ బిల్లు ఆమోదం పొందలేదని ఆయన అన్నారు. మోదీ మహిళ ద్వేషి అని అందుకే మహిళా బిల్లును పక్కన పెట్టారని ఆయన అన్నారు. కాంగ్రెస్ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి వస్తే 6 నెలల్లో చట్టసభలు మహిళ బిల్లును తీసుకువస్తామని ఆయన అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 4 మంత్రి పదవులు.. అత్యంత కీలకమైన శాఖలు కేటాయిస్తామని అన్నారు. కేసీఆర్ మహిళా ద్వేషిగా మిగిలారని… టీఆర్ఎస్ తొలి క్యాబినెట్ లో ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి కేటాయించలేదని… రెండో సారి మహిళలకు మంత్రి పదవులు కేటాయించిన.. అధికారం చెలాయించే వారు వేరే వారని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news