మ‌రో కుంభ‌కోణం బ‌య‌ట‌పెట్టిన రేవంత్‌రెడ్డి.. ఈ సారి టార్గెట్ ఎవ‌రు?

తెలంగాణ‌లో ప్ర‌స్తుతం తీవ్ర రూపం దాల్చుతోంది. నిత్యం వేలాది కేసుల‌తో నిలువుణా వ‌ణికిస్తోంది. ఇలాంటి టైమ్‌లో ప్ర‌భుత్వం మందులు, ఆక్సిజ‌న్ కొర‌త లేకుండా చ‌ర్య‌లు తీసుకుంటోంది. అయిన‌ప్ప‌టికీ ప‌లు ఆస్ప‌త్రుల్లో బెడ్లు, మందులు లేవంటే కంప్ల‌యింట్లు వ‌స్తూనే ఉన్నాయి. ఇలాంటి టైమ్‌లో ఎంపీ రేవంత్‌రెడ్డి మ‌రోసారి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

ఇప్ప‌టికే ఈ ఎంపీ దేవ‌ర‌యంజాల్ భూముల‌పై ఆరోప‌ణ‌లు చేసి, ఆధారాల‌తో స‌హా టీఆర్ఎస్ మంత్ర‌లు అక్ర‌మాల‌ను మీడియాకు విడుద‌ల చేశారు. దీనిపై ప్ర‌భుత్వం కూడా విచార‌ణ జ‌రుపుతోంది. దీంతో ఈయ‌నకు రాష్ట్ర వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ వ‌చ్చేసింది.

ఇప్పుడు ఏకంగా ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల‌లో భారీ కుంభ‌కోణం జ‌రిగింద‌రూ బాంబు పేల్చారు. వంద‌ల కోట్లు అక్ర‌మాలు జ‌రిగాయంటూ మ‌రోసారి మీడియా ముందుకు వ‌చ్చారు. అయితే ఈ సారి ప్ర‌త్యేకంగా ఎవ‌రి పేరు చెప్ప‌కుండా ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌లు చేశారు. ఈ విష‌యంలో విచార‌ణ జ‌ర‌పాలంటూ తాను ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీకి కూడా లేఖ రాశాన‌ని వివ‌రించారు. మ‌రి ఈ కుంభ‌కోణం వ్య‌వ‌హారం ఎటువైపు దారి తీస్తుందో చూడాలి. ఏదేమైనా ఎంపీ రేవంత్‌రెడ్డి వ‌రుస ఆరోప‌ణ‌లు టీఆర్ ఎస్‌కు కునుకు లేకుండా చేస్తోంది.