రైతుల కోసం రణం చేయడానికి సిద్ధం.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై నిత్యం నిప్పులు చెరుగుతున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మరోసారి బీజేపీ, టీఆర్ఎస్ పాలనను ఉద్దేశిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. రెండు ప్రభుత్వాలు రైతుకు భరోసా ఇవ్వకుండా రాజకీయ దాడులు, ప్రతి దాడులతో కాలక్షేపం చేస్తున్నాయని ట్విటర్ వేదికగా విమర్శించారు. అన్నదాతలకు అండగా ఉంటూ వారి పక్షాన రైతు రణం చేయడానికి కాంగ్రెస్ సిద్దమైందని రేవంత్‌ రెడ్డి ట్వీట్ చేశారు.

ప్రభుత్వ యంత్రాంగం, రైతు మిల్లర్ల మధ్య ఆరుగాలం శ్రమించి పంట పండించిన సాగుదారు నలిగిపోతున్నాడని రేవంత్ అన్నారు. రైతు తన కష్టాన్ని అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యల పరిష్కారానికి పార్టీ పక్షాన చిత్తశుద్ధితో పోరాడతామని స్పష్టం చేశారు.

అవసరం ఉందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, కిసాన్‌సెల్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, సీనియర్‌ నేతలు అంజన్‌కుమార్‌ యాదవ్‌, షబ్బీర్‌ అలీ, అన్వేష్‌రెడ్డి, ప్రీతమ్‌, అయోధ్యరెడ్డి తదితరులతో కలిసి శనివారం హైదరాబాద్‌ గాంధీభవన్‌లో జూమ్‌ మీటింగ్‌ నిర్వహించారు.