ఆయన నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు: రేవంత్ ఆవేదన

-

రాజకీయంగా చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కొంత మంది నుంచి ప్రోత్సాహం లభించడం లేదు. ప్రధానంగా ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేకపోవడం ఎంపీల మధ్య సఖ్యత లేకపోవడం వంటి సమస్యలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ని దారుణంగా వెంటాడుతున్నాయి. దీని వలన కాంగ్రెస్ పార్టీలో సమస్యల తీవ్రత పెరిగిపోతుంది అనే భావన వ్యక్తమవుతోంది. అయితే రాజకీయంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి వంటి నేతలను కాంగ్రెస్ పార్టీ సమర్థవంతంగా వాడుకోలేకపోతుంది అనే అభిప్రాయం కూడా కొంతమందిలో వ్యక్తమవుతుంది.

revanth_reddy

ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఇప్పుడు పార్టీ మారే ఆలోచన చేస్తున్నారని కూడా సమాచారం. రేవంత్ రెడ్డి కారణంగా కొంతమంది నేతలు కాంగ్రెస్ పార్టీలో ఉండటానికి ఇష్టపడటం లేదు అని ప్రచారం కొంతమంది చేస్తున్నారు. ఇది ఎంత వరకు నిజం ఏంటనేది తెలియదు గానీ రేవంత్ రెడ్డి మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది కారణంగా ఉండలేకపోతున్నారు అని కూడా తెలుస్తుంది.

ఉత్తమ్ కుమార్ రెడ్డి తనను పక్కన పెడుతున్నారని టిఆర్ఎస్ పార్టీకి ఆయన సహకరిస్తున్నారని దీనివలన కాంగ్రెస్ పార్టీలో తన మాటకు విలువ ఉండటం లేదు అని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి ముందుకు రావాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఉత్తంకుమార్ రెడ్డి చేస్తున్నారు అని కొంతమంది రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news