లవ్ స్టోరీ వాన పాట.. డాన్సులతో అదరగొట్టిన సాయి పల్లవి నాగ చైతన్య..

-

సారంగదరియా పాట హిట్ అయ్యాక లవ్ స్టోరీ సినిమా వచ్చే ప్రతీ అప్డేట్ పై ప్రేక్షకులు. చాలా ఆసక్తిగా ఉన్నారు. ఆ ఆసక్తిని మరింత పెంచడానికా అన్నట్టు తాజాగా వాన పాట రిలీజ్ చేసింది లవ్ స్టోరీ చిత్ర బృందం. డాబా మీద వర్షం పడుతుంటే ఆ వర్షపు నీళ్ళలో ఏమో ఏమో కలలే, ఎన్నో ఎన్నో తెరలే అనుకుంటూ సాగే పాట లిరికల్ వీడియోని రిలీజే చేసారు. ఈ పాట అద్భుతంగా ఉంది. పూర్తిగా వానలో తడుస్తూ, డాబా మీద ఆగిన నీళ్ళని కాళ్ళతో ఎగజిమ్ముతూ డాన్సులు చేసారు.

సాయి పల్లవితో సమానంగా అన్నట్టు నాగ చైతన్య డాన్సు చేసాడు. వీరిద్దరూ పోటాపోటిగా డాన్స్ చేసారు. పవన్ సిహెచ్ అందించిన సంగీతం అద్భుతంగా ఉంది. కొరియోగ్రఫర్ శేఖర్ మాస్టర్ కుదిర్చిన స్టెప్పులు బాగున్నట్టు అనిపిస్తున్నాయి. భాస్క్కర బట్ల సాహిత్యం చాలా గొప్పగా ఉంది. ముఖ్యంగా ఈ పాట ద్వారా హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందని అర్థం అవుతుంది. మరో మారు ఫిదా లాంటి సినిమా అయ్యేలా కనబడుతుంది. ఏప్రిల్ 16వ తేదీన లవ్ స్టోరీ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news