ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి.. అధిష్టానంతో జ‌గ్గారెడ్డి వ్య‌వ‌హారంపై చ‌ర్చ‌!

-

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇటీవ‌ల జ‌రుగుతున్న ప‌రిణామాలు క‌లక‌లం రేపుతున్నాయి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్య‌వ‌హారాల ఇన్ ఛార్జీ మాణికం ఠాగూర్ పై ప‌లువురు సీనియ‌ర్ నాయ‌కులు అసంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి, సీనియ‌ర్ నాయ‌కులు వీ హ‌న్మంత రావు బ‌హిరంగంగానే వీరిపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇటీవ‌ల వీహెచ్, జ‌గ్గారెడ్డి ప‌లువురు సీనియ‌ర్ల‌తో ప్ర‌త్యేక స‌మావేశం నిర్వ‌హించారు. రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వంపై అసంతృప్తిగా ఉన్న సీనియ‌ర్ల‌ను ఆహ్వానించారు.

అయితే ఈ స‌మావేశం పై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీరియ‌స్ అయింది. ఈ ప్ర‌త్యేక స‌మావేశానికి వెళ్ల‌కూడ‌ద‌ని ప‌లువురు సీనియ‌ర్లకు ఫోన్ చేసి చేప్పింది. దీంతో ఈ స‌మావేశం అర్థంత‌రంగా ముగిసింది. ఈ స‌మావేశం త‌ర్వాత‌.. జ‌గ్గారెడ్డికి ఉన్న వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ తో పాటు ఇత‌ర అన్ని బాధ్య‌త‌ల నుంచి పీసీసీ త‌ప్పించింది.

కాగ సోమ‌వారం సాయంత్రం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. జ‌గ్గారెడ్డి వ్య‌వ‌హారం, సీనియ‌ర్ల స‌మావేశంపై అధిష్టానంతో ఈ రోజు చ‌ర్చించే అవ‌కాశం ఉంది. జ‌గ్గారెడ్డితో పాటు వీహెచ్ పై కూడా క్ర‌మ శిక్షణా చర్య‌లు తీసుకోవాల‌ని సూచించే అవ‌కాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news