మెగాస్టార్ చిరంజీవి నటించిన మృగరాజు సినిమా.. అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించారు. 2001 సంవత్సరంలో వచ్చిన ఈ యాక్షన్… మంచి కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమాలో చిరంజీవి హీరోగా నటించగా… సిమ్రాన్ హీరోయిన్ గా నటించింది. సంఘవి మరియు నాగేంద్రబాబు సహాయక పాత్రలు చేశారు.
సినిమాకు మణిశర్మ సంగీతం అందించగా… తమిళంలో వెట్ట కారన్ పేరుతో అనువదించారు. ఈ సినిమా పూర్తిగా అడవిలో… సింహాల విజువల్స్ మధ్య జరిగింది. ఈ సినిమాలో కీలక పాత్ర సింహానిదే. చిరంజీవికి అలాగే సింహం కు మధ్య ఫైట్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. అందుకే సింహాన్ని గ్రాఫిక్స్ లో కాకుండా రియల్ సింహాన్ని తీసుకొచ్చారు. అప్పటికీ వందకు పైగా హాలీవుడ్ సినిమాల్లో నటించినా భాస్కర్ సర్కస్ కంపెనీ జాతికి చెందిన సింహాన్ని దక్షిణాఫ్రికా నుంచి స్పెషల్గా తెప్పించారు. అయితే ఈ సింహం కోసం ఏకంగా రూ.67 లక్షలు ఖర్చు చేశారు.
సింహానికి పారితోషికం రూ.67 లక్షలు :
7 అడుగుల పొడువు, 4.5 అడుగుల ఎత్తున్న జాక్ కు రోజుకు 10 వేల డాలర్లు ఇచ్చి తెచ్చుకున్నారు. మొత్తం 26 రోజుల పాటు సింహం సీన్లను తీసి సర్కర్ కంపెనీ వారికి జాక్ పారితోషికం కింద దాదాపు రూ.67 లక్షలు ముట్ట జెప్పారు. ఈ సింహం రాత్రి వేళ మాత్రమే బయటికి వచ్చేది కాబట్టి దానికి తగ్గట్టే సీన్లను ప్లాన్ చేసుకున్నారు.