ఈ ప్రశ్నలకి రోజా దగ్గర సమాధానాలు ఉన్నాయా ?

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలంతా కరోనా వైరస్ తో పోరాడుతుంటే అధికార పార్టీ నేతలు చేస్తున్న అత్యుత్సాహపు పనుల వల్ల కొన్ని పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. శ్రీకాళహస్తి మరియు సూళ్లూరుపేట కి చెందిన ఎమ్మెల్యేలు చేసిన పనుల వల్ల సదరు నియోజకవర్గాలలో ఒక్కసారిగా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. తాజాగా ఇదే విధంగా రోజా తన నియోజక వర్గం పుత్తూరులో ఒక బోరు ఓపెనింగ్ కార్యక్రమానికి చేసిన హడావిడి వీడియో లో, లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘనలు స్పష్టంగా బయటపడ్డాయి. ఆ వీడియోలో ప్రజలంతా రోజా నడుస్తుంటే పూలతో ఆహ్వానించడం, గజమాలతో సత్కరించడం అన్ని బయటపడ్డాయి.MLA RK Roja gets flowers placed at feet as she arrives to ...అయితే ఈ విషయం స్థానిక మీడియా పట్టించుకోకపోయినా గాని సోషల్ మీడియాలో మరియు నేషనల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అధికార పార్టీ ఎమ్మెల్యే అయ్యుండి లాక్ డౌన్ సందర్భంలో సోషల్ డిస్టెన్స్ పాటించకుండా బోరు ఓపెనింగ్ చేసింది అని, కొంతమంది అధికార పార్టీ ఎమ్మెల్యేల వలె కరోనా వ్యాప్తికి కారణం అవుతోందని సోషల్ మీడియాలో విమర్శలు తీవ్ర స్థాయిలో వస్తున్నాయి. దీంతో వ్యవహారం మొత్తం అదుపుతప్పి తనపై బురద పడేలా కనిపిస్తూ ఉండటంతో వెంటనే రాష్ట్ర మీడియాలో దర్శనమిచ్చి అక్కడ అలాంటిదేమీ జరగలేదని రోజా క్లారిటీ ఇచ్చింది.

 

సోషల్ డిస్టెన్స్ మరియు అన్ని జాగ్రత్తలు తీసుకునే ఓపెనింగ్ కార్యక్రమం చేసినట్లు చెప్పుకొచ్చింది. ఇదే సమయంలో మరో పక్క ఇదంతా తెలుగుదేశం పార్టీ చేసిన కుట్ర అంటూ ప్రతిపక్షం పైకి నెపాన్ని వేసింది. అయితే ఈ సందర్భంలో టీవీ ఛానల్ లైవ్ ఇంటర్వ్యూ లో పలు ప్రశ్నలకు రోజా సమాధానం చెప్పలేక నీళ్లు నమిలింది. డిస్టెన్స్ పాటించకుండా  భారీ గజమాలతో సత్కరించిన దానికి ఏమని సమాధానం చెబుతారు ?, అదేవిధంగా బోరు కూడా వేయించుకోలేని నిరు పేద ప్రజల దగ్గరికి పూలు ఎలా వచ్చాయి? అంటూ మీడియా యాంకర్లు వేస్తున్న ప్రశ్నలకు రోజా దగ్గర సమాధానాలు లేకుండా పోయాయి.

Read more RELATED
Recommended to you

Latest news