అబ్బే.. ఈ సర్వేను నమ్మాలా ఖచ్చితంగా అంటారా? నమ్మాల్సిందే. ఎందుకంటే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు 85 స్థానాలకు పైగా వస్తాయని ఆ సర్వే చెప్పింది.
ఆరా(AARAA).. అనే సర్వే సంస్థ.. ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వెలువరిచిన సర్వే ఫలితాలు నూటికి నూరు శాతం నిజమయ్యాయి. దీంతో ఆ సర్వే సంస్థ ఏపీలో చేసిన సర్వేను కూడా నమ్మాల్సి వస్తోంది. తాజాగా ఆరా సర్వే ఏపీలోనూ తన సర్వే ఫలితాలను వెలువరించింది. ఏపీలో 120కి పైగా సీట్లు వస్తాయట. అది ఖచ్చితం అట. ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడం కూడా ఖాయమట. కానీ… చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేసిన రోజా మాత్రం ఖచ్చితంగా ఓడిపోతారట. అలా షాకిచ్చారు సర్వేతో.
అబ్బే.. ఈ సర్వేను నమ్మాలా ఖచ్చితంగా అంటారా? నమ్మాల్సిందే. ఎందుకంటే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు 85 స్థానాలకు పైగా వస్తాయని ఆ సర్వే చెప్పింది. నిజంగానే టీఆర్ఎస్‌కు 85 కంటే ఎక్కువ 88 స్థానాలు వచ్చాయి. అలాగే 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ సెంచరీ కొడుతుందని చెప్పింది. అదే జరిగింది.
సో.. ఇప్పుడు ఏపీలో చేసిన సర్వే ప్రకారం.. ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుందట. ఎంపీ సీట్లు కూడా 20 దాకా వస్తాయట. ఇక.. టీడీపీకి 50 సీట్లు వస్తాయని ఈ సర్వే తేల్చింది. కాకపోతే వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా మాత్రం ఓడిపోతారట. ఆమె గెలిస్తే.. లేడీ కోటాలో హోమంత్రి పదవి ఖాయమని అంతా అనుకున్నారు. అయతే.. నగరిలో రోజా ఓడిపోబోవడానికి వైసీపీ నేతలే కారణమట. రోజా గెలిస్తే తమకు మంత్రి పదవి ఎక్కడ రాకుండా పోతుందోనని.. ఆమెను ఓడించడానికి తెగ ప్రయత్నించారట. అదే అసలు కారణమట. ఒకవేళ నిజంగానే రోజా ఓడిపోతే.. ఆమెకు మంత్రి పదవి దక్కనట్టేనా? తన మంత్రి కల చెదిరినట్టేనా? తెలియాలంటే మే 23 దాకా ఆగాల్సిందే.