ఆర్‌ఎస్పీ ఎఫెక్ట్.. అధికార పార్టీ నుంచి ఆ వర్గం దూరం..!

-

ఆరేళ్ల పదవీ కాలం ఉన్నప్పటికీ వీఆర్ఎస్ తీసుకుని తెలంగాణ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు మాజీ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్. ఈ క్రమంలోనే ఆయన సొంత పార్టీ పెడతారనే వార్తలు మొదట్లో వినిపించగా, ఆయన చివరకు బీఎస్పీలో చేరారు. ‘బడుగుల రాజ్యాధికార సంకల్ప సభ’ పేరటి సభ నిర్వహించి నల్లగొండ జిల్లాలోని ఎన్జీ కాలేజీ ప్రాంగణంలో బీఎస్పీలో చేరారు ప్రవీణ్ కుమార్. ‘అక్షరం, ఆర్థికం, ఆరోగ్యం’ అనే నినాదమిచ్చారు.

TRS-Party | టీఆర్ఎస్
TRS-Party | టీఆర్ఎస్

కాగా, సభ సూపర్ సక్సెస్ అవడంతో పాటు దళిత యువత ఉత్సాహంగా ఈ సభకు హాజరు కావడం పట్ల టీఆర్ఎస్ పార్టీలో అంతర్మధనం మొదలైనట్లు సమాచారం. నల్లగొండ జిల్లాలో జరిగిన సభకు భారీ స్థాయిలో ప్రజలు, యువకులు హాజరు కావడం ద్వారా ప్రవీణ్ ప్రభావం ఎంత వరకు ఉండబోతుంది? అనే విషయమై గులాబీ నేతలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ‘దళిత బంధు’ స్కీమ్ ద్వారా పూర్తి దళిత జాతి మొత్తం తమ వైపు ఉంటుందని టీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలో వారాని బీఎస్పీ వైపునకు తిప్పుకునేందుకు ఆర్.ఎస్.ప్రవీణ్ ప్రయత్నిస్తున్నారని చర్చించుకుంటున్నారు.

మొత్తంగా దళిత ఓటు బ్యాంకు విషయమై అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో టీఆర్ఎస్ వర్సెస్ ప్రవీణ్ అనే సీన్ క్రియేట్ అవుతుందా? అని భయపడుతున్నారట. ఈ నేపథ్యంలో నల్లగొండ సభకు హాజరైన వారు ఎంత మంది? ఏ ఏజ్ గ్రూప్ వారు ఎక్కువగా ఉన్నారు? అనే విషయాలను కనుక్కుంటున్నారట గులాబీ పార్టీ నేతలు. ఇకపోతే నల్లగొండ వేదికగా టీఆర్ఎస్ సర్కారుపై ప్రవీణ్ చేసిన సూటి విమర్శలకు కేసీఆర్ త్వరలో స్పందిస్తారని అధికార పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news