రెండు పులులు పోటాపోటీగా తలపడుతుంటే ఎలా ఉంటుందో మీకు తెలుసా?

-

సాధారణంగా పులి అంటే ఇష్టపడే వాళ్లు చాలా మంది ఉంటారు. కానీ, ఆ పులిని దగ్గరి నుంచి రియల్‌గా చూసిన వారు తక్కువ మందే ఉండొచ్చు. ఒక పులిని చూస్తేనే భయం మన్నలి వేంటాడే సందర్భంలో రెండు పులులు తలపడుతున్నపుడు చూస్తే ఎలా ఉంటుందో? ఊహించుకోండి..గుండెల్లో రైళ్లు పరిగడెతున్నట్లు ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలా రెండు టైగర్స్ ఫైట్ చేసుకుంటున్న వీడియో ఒకట సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇంతకీ అవి ఎక్కడ ఫైట్ చేసుకుంటున్నాయి? వీడియోను ఎవరు షేర్ చేశారు? అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ స్టోరీని ఫుల్లీ రీడ్ చేయాల్సిందే.

Today At Nagarhole tiger fight

పులి గర్జన వింటేనే భయపడే జనాలు..రెండు పులులు ఫైట్ చేసుకుంటున్న సీన్ చూస్తే ఇక బెదిరిపోవాలంతే…ఒళ్లు గగుర్పొడిచే పులుల ఫైట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. కర్నాటకలోని నాగరహోల్ నేషనల్ పార్క్‌లో రెండు టైగర్స్ ఫైట్ చేసుకుంటుండగా ఈ వీడియో తీశారు. బి.ఎస్.సురన్ అనే వ్యక్తి ట్విట్టర్ వేదికగా ఈ వీడియోను షేర్ చేయగా, అది నెట్టంట ట్రెండవుతోంది. సదరు వీడియోలో తొలుత రెండు టైగర్స్ ఎదురెదురు పడతాయి.

ఈ నేపథ్యంలోనే అవి భయంకరంగా గర్జించుకుంటాయి. ఆ తర్వాత రెండు టైగర్స్ భీకర పోరుకు సిద్ధమై ఫైట్ చేసుకుంటాయి. బాక్సర్స్ వలే వెనుక కాళ్లపై నిలబడి రెండు టైగర్స్ పంజా విసురుకోవడం మనం వీడియోలో చూడొచ్చు. ఈ టైగర్స్ ఫైట్ సమయంలో అడవి మొత్తం పులి గర్జనతో భీకరంగా మారిపోవడాన్ని మనం గమనించొచ్చు. ప్లేస్ కోసమై టైగర్స్ ఫైట్ చేసుకున్నాయని నెటిజన్లు పేర్కొంటున్నారు. వీడియోను చూసి భయపడిపోవడంతో పాటు ఫెరోషియస్ టైగర్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news