మంత్రికో రూల్.. ప్రజలకో రూలా..? కేటీఆర్‌పై ప్రశ్నల వర్షం

-

మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ ఒకటి ఆయన్ను విమర్శల పాలు చేస్తోంది. తాజాగా ట్విట్టర్ వేదికగా కేటీఆర్ కొవిడ్ వ్యాక్సిన్ సెకండ్ డోస్ తీసుకున్నట్లు పేర్కొంటూ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ ప్రస్తుతంలో నెట్టింట తెగ వైరలవుతోంది. నెటిజన్లు మంత్రి కేటీఆర్‌ను ఈ ట్వీట్ గురించి భిన్న రకాలుగా ప్రశ్నిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు ఆస్పత్రికి వెళ్లి వ్యాక్సిన్ తీసుకుంటుంటే కేటీఆర్ మాత్రం ఇంట్లో వ్యాక్సిన్ తీసుకోవడం ఏంటి అని అడుగుతున్నారు.

ప్రజలంతా ఆస్పత్రుల్లో, ఆరోగ్య కేంద్రాల్లో టీకాలు దొరకక ఇబ్బందులు పడుతుంటే అమాత్యులు కేటీఆర్ మాత్రం దర్జాగా ఇంటికే వ్యాక్సిన్ తెప్పించుకోవడం ఏంటని నిలదీస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లడం అంటే నామూషీ అయితే కనీసం యశోద ఆస్పత్రికి అయినా వెళ్లాల్సిందని సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే మినిస్టర్‌కు ఒక రూల్.. సామాన్య ప్రజానీకానికి ఒక రూలా? అని కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్నారు. విపక్ష పార్టీలు సైతం ట్విట్టర్ వేదికగా కేటీఆర్‌ను విమర్శిస్తున్నాయి. కేంద్రం ఏ సాయం చేయలేదని పేర్కొంటూనే ప్రధాని మోడీ బర్త్ డే రోజున కేటీఆర్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారని, కేటీఆర్ విమర్శలకు కాలమే సమాధానం చెప్తుందని బీజేపీ వారు కామెంట్స్ చేస్తున్నారు. మోడీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వడం వల్లే కేటీఆర్ టీకా వేసుకోగలిగాడని అంటున్నారు. ఇంట్లోనే మంత్రి వ్యాక్సిన్ తీసుకోవడం‌పై కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ వేదికగా మంత్రిని ఎద్దేవా చేసింది. నిరుపేద ప్రజానీకం ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ కోసం ఇబ్బందులు పడుతుండగా, మా మంత్రి హాయిగా తన ఇంట్లోనే సెకండ్ డోస్ వ్యాక్సిన్ వసుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ వ్యంగ్యంగా విమర్శించింది. మొత్తంగా కేటీఆర్ చేసిన ట్వీట్ ద్వారా సోషల్ మీడియాలో దుమారమే రేగింది.

Read more RELATED
Recommended to you

Latest news