చేవెళ్ల సభలో టీఆర్‌ఎస్‌లో చేరనున్న సబితా ఇంద్రారెడ్డి

-

ఇవాళ ఆమె ప్రగతి భవన్‌లో తన కొడుకుతో కలిసి సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈసందర్భంగా వాళ్లు చాలాసేపు చర్చించారు.

ఓవైపు ఏపీలో టీడీపీ ఖాళీ అవుతుండగా… మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ ఖాళీ అవుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు ప్రకటించగా.. తాజాగా మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్టు ప్రకటించారు. సబిత, తన కొడుకు కార్తీక్‌రెడ్డితో కలిసి చేవెళ్లలో జరిగే భారీ బహిరంగ సభలో టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు.

సీఎం కేసీఆర్.. సబిత కొడుకు కార్తీక్ రెడ్డికి చేవెళ్ల ఎంపీ స్థానం, ఆమెకు మంత్రి పదవి ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇవాళ ఆమె ప్రగతి భవన్‌లో తన కొడుకుతో కలిసి సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈసందర్భంగా వాళ్లు చాలాసేపు చర్చించారు.

సబితా ఇంద్రారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరికపై చాలా ఊహాగానాలు వినిపించాయి. ఆమె ముందు టీఆర్‌ఎస్‌లో చేరుదామనుకున్నా… కాంగ్రెస్ పెద్దలు ఆమెను బుజ్జగించడానికి ప్రయత్నించారు. ఏకంగా రేవంత్ రెడ్డినే రంగంలోకి దించారు. రాహుల్ గాంధీతో ఫోన్‌లోనూ మాట్లాడించారు.

అయినప్పటికీ.. సబితా ఇంద్రారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరేందుకే మొగ్గు చూపారు. తన కొడుకుకు గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్ర నగర్ టికెట్ ఇవ్వకపోవడం.. ఇప్పుడు చేవెళ్ల ఎంపీ టికెట్‌ను నిరాకరించడంతోనే సబిత కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. మొత్తానికి టీఆర్‌ఎస్‌లో సబిత, కార్తీక్ రెడ్డికి సముచిత స్థానం దక్కుతుందని సీఎం కేసీఆర్ హామీ ఇవ్వడంతో టీఆర్‌ఎస్‌లో వాళ్ల చేరిక ఖాయం అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version