కేసీఆర్‌పై కేసులు పెట్ట‌లేదా.. ఇప్పుడు ర‌ఘురామ‌పై పెడితే త‌ప్పేంటిః స‌జ్జ‌ల హాట్ కామెంట్స్‌

-

ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌కంప‌న‌లు రేపిన ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు అరెస్టు చుట్టూ ఇప్పుడు రాజ‌కీయాలు శ‌ర‌వేగంగా తిరుగుతున్నాయి. ఈయ‌న అరెస్టుపై ప్ర‌తిప‌క్షాలు భ‌గ్గుమంటున్నాయి. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా మాట్లాడితే అరెస్టు చేస్తారా అంటూ మండిప‌డుతున్నాయి. అయితే వైసీపీ నేత‌లు మాత్రం ఎంపీపై ఘాటుగా స్పందిస్తున్నారు.

తాజాగా ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఎంపీ అరెస్టుపై హాట్ కామెంట్స్‌చేశారు. ఎంపీ ర‌ఘురామ.. చంద్ర‌బాబు, లోకేశ్‌, సుజ‌నా చౌదిరితో క‌లిసి కుట్ర చేస్తున్నాడ‌ని ఆరోపించారు. వారి డైరెక్ష‌న్‌లోనే ప్ర‌భుత్వాన్ని అస్థిర‌ప‌రిచేందుకు ప్లాన్ చేశాడ‌ని చెప్పారు.

ఎంపీ అరెస్టు ఒక్క‌రోజులో జ‌రిగింది కాద‌ని, సీఐడీ చ‌ట్ట ప్ర‌కారం అరెస్టు చేసింద‌న్నారు. ఇందులో ప్ర‌భుత్వం జోక్యం చేసుకోలేద‌ని స్ప‌ష్టం చేశారు. చంద్ర‌బాబు హ‌యాంలో కూడా కేసీఆర్‌పై 12రాజ‌ద్రోహం కేసులు పెట్టార‌ని, అది త‌ప్పు కాన‌ప్పుడు ఇదెలా త‌ప్ప‌వుతుంద‌ని ప్ర‌శ్నించారు. దీంతో ఏపీ రాజ‌కీయాల్లోకి కేసీఆర్ అంశం హైలెట్ అయింది. మ‌రి దీనిపై ప్ర‌తిప‌క్షాలు ఎలా స్పందిస్తాయో చూడాలి

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version