తెలంగాణలో టీడీపీని ఆదరించేవాళ్లే లేరు.. అందుకే టీఆర్ఎస్ లో చేరుతున్నా: ఎమ్మెల్యే సండ్ర

3

ఖమ్మం జిల్లా అభివృద్ధి చెందాలంటే అది సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమవుతుంది. జిల్లా అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ వెంట నడవాలని నిర్ణయించుకున్నాను.. కార్యకర్తలతో చర్చించిన అనంతరం టీఆర్ఎస్ పార్టీలో చేరుతా. తెలంగాణలో టీడీపీని ఆదరించేవాళ్లు లేరు. అందుకే టీఆర్ఎస్ లో చేరుతున్నా.. అని సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఇవాళ టీడీఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన ఆయన పై వ్యాఖ్యలు చేశారు.

sathupalli mla sandra venkata veraiah to join in trs party

తెలంగాణలో టీడీపీ ఉనికి కోల్పోయింది. సీతారామ ప్రాజెక్టుతో ఖమ్మం జిల్లాను సీఎం కేసీఆర్ సస్యశ్యామలం చేస్తున్నారు. సత్తుపల్లి నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తా. నియోజకవర్గం అభివృద్ధి కోసమే కానీ.. స్వార్థం రాజకీయాల కోసం నేను పార్టీ మారడం లేదు. త్వరలోనే టీడీపీకి రాజీనామా చేస్తా.. అని సండ్ర వెంకటవీరయ్య తెలిపారు.

amazon ad