కాంగ్రెస్‌లో స్క్రీనింగ్ కమిటీ చిచ్చు..వారు చెబితేనే సీటు.!

-

కాంగ్రెస్ లో రాజకీయాలు సాఫీగా సాగడం కష్టమనే చెప్పాలి. అలా జరిగితే కాంగ్రెస్ పార్టీ కానే కాదు. అందుకే ఆ పార్టీలో ఎప్పుడు ఏదొక రచ్చ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడుప్పుడే కాంగ్రెస్ పార్టీ రేసులోకి వస్తుంది. బి‌ఆర్‌ఎస్ తో ఢీ అంటే ఢీ అనేలా కాంగ్రెస్ ముందుకెళుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ లో కీలక మార్పులు జరుగుతున్నాయి. ఎన్నికలే లక్ష్యంగా కమిటీలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల ప్రచార కమిటీ ఏర్పాటు అయింది.

ఈ కమిటీలో దాదాపు అందరు సీనియర్లకు ప్లేస్ దక్కింది. కానీ కొందరికి ప్లేస్ దక్కలేదు. దీంతో దక్కని వారు ఊరికే ఉండరు కదా..వారు రచ్చ చేయడం మొదలుపెట్టారు. తమకు ఎందుకు అవకాశాలు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. ఈ రచ్చ ఇలా సాగుతుండగానే తాజాగా కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు అయింది. అంటే ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్ధుల ఎంపిక కోసం ఈ కమిటీ ఏర్పాటు అయింది.వీరే అభ్యర్ధులని ఎంపిక చేయనున్నారు.

ఈ కమిటీలో ఏ‌ఐ‌సి‌సి కీలక నేతలు మురళీధరన్, బాబా సిద్ధిఖీ, జిగ్నేశ్ లకు చోటు కల్పించారు. అందులో మెంబర్లుగా రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే, సి‌ఎల్‌పి నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిలని నియమించింది. అయితే ఈ కమిటీనే అభ్యర్ధుల ఎంపికలో కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.

దీంతో కొందరు సీనియర్లు అసంతృప్తిగా ఉన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ, జానారెడ్డి, జగ్గారెడ్డి లాంటి వారికి ప్లేస్ దక్కలేదు. దీంతో ఆయా నేతల వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయి. వీరి రికమెండ్ చేసే నేతలకు సీట్లు దక్కుతాయో లేదో డౌట్ నెలకొంది. మొత్తానికి అభ్యర్ధుల ఎంపిక కాంగ్రెస్ లో పెద్ద చిచ్చు రాజేసేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news