బెజవాడ వైసీపీకి నిమ్మగడ్డ షాక్ ఇవ్వడం ఖాయమా…?

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో విజయవాడ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ తరుణంలో రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌కు ఫిర్యాదులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ 17వ డివిజన్‌ కార్పొరేటర్‌ అభ్యర్ధి కె.రత్నకుమారి పై అనర్హత వేటు వేయాలని ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేసారు.

కె. రత్నకుమారికి ముగ్గురు కుమార్తెలు ఉన్నందున స్ధానిక సంస్ధల ఎన్నికల్లో అనర్హురాలంటూ ఫిర్యాదు చేసారు టీడీపీ అభ్యర్ధి ఎన్‌.స్వాతి. వైసీపీ అభ్యర్థి కె. రత్నకుమారి భర్త ప్రసాద్‌ బాబు విత్‌ డ్రా చేసుకోవాల్సిందిగా మా పై బెదిరింపులకు దిగుతున్నారు అని టీడీపీ నేతలు ఆరోపించారు. కె. రత్నకుమారి, ముగ్గురు కుమార్తెల పేర్లు కూడా ప్రస్తావించి ఉన్న రేషన్‌ కార్డు నెంబర్‌, వివరాలు ఎస్‌ఈసీకి టీడీపీ అభ్యర్ధి ఎన్‌.స్వాతి అందించారు.

తక్షణం రత్నకుమారి అభ్యర్ధిత్వాన్ని రద్దు చేయాలని ఎస్‌ఈసీకి విజ్ఞప్తి చేసారు. ఇక విజయవాడలో గత ఎన్నికల్లో ఓసీగా ఈ ఎన్నికల్లో బీసీగా ఒకరు పోటీకి దిగారు. దీనిపై టీడీపీ నేతలు, జనసేన నేతలు ఎన్నికల కమీషన్ దృష్టికి తీసుకువెళ్ళి ఫిర్యాదు చేసారు. దీనితో అన్నీ పరిశీలిస్తున్న ఎన్నికల సంఘం ఏ నిర్ణయం తీసుకుంటుందో అని ఆసక్తిగా చూస్తున్నారు.

రత్నకుమారి,ఆమె భర్తతో పాటు ఆమె కుమార్తెలు కలిసి ఉన్న ఫోటోలను సైతం ఎస్‌ఈసీకి అందచేసిన టీడీపీ అభ్యర్ధి