కీలక పాయింట్ లో సెల్ఫ్ గోల్ వేసుకుని ఇరుక్కుపోయిన నిమ్మగడ్డ రమేశ్..!!

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు వాయిదా పడటం గురించి రకరకాల వార్తలు వినబడుతున్నాయి. అధికార పార్టీ నేతలు మాట్లాడుతూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కావాలని స్థానిక ఎన్నికలను వాయిదా వేశారని ఆరోపించారు. ఇదే టైములో చంద్రబాబు ఆదేశాలు మేరకు ఒకే సామాజిక వర్గం కాబట్టి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆయన డైరెక్షన్లోనే ఎవరినీ సంప్రదించకుండా స్థానిక ఎన్నికలను వాయిదా వేశారని వైసీపీ నేతలు ఆరోపించడం జరిగింది. అంతేకాకుండా సుప్రీంకోర్టుకు వెళ్లిన వైఎస్ జగన్ కి స్థానిక ఎన్నికలను వాయిదా వేయాలని తీర్పు రావడం తో ఒక్క సారిగా షాక్ కు గురయింది. Image result for nimmagadda ramesh kumarఈ దెబ్బతో రాష్ట్రానికి రావాల్సిన ఐదువేల కోట్లు రాకుండా పోవటంతో ప్రస్తుతం వైసీపీ నేతలు ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయంపై అసహనం చెందడం జరిగింది. కాగా స్థానిక ఎన్నికల వాయిదా వేయడాన్ని చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని రాసిన లెటర్ కు నిమ్మగడ్డ రమేష్ కుమార్ జవాబుగా మరో లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్ లో మాట్లాడుతూ ఎన్నికల వాయిదాకు కేంద్ర కుటుంబ ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల సూచనలే కారణమని చెప్పారు. కరోనా వైరస్ తీవ్రత వల్ల కేంద్ర వైద్య అధికారుల సూచన మేరకు నిర్ణయం తీసుకున్నట్లు నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు.

 

దీంతో ఈ లెటర్ లో కీలక పాయింట్ లో సెల్ఫ్ గోల్ వేసుకొని అడ్డంగా బుక్కయ్యాడు నిమ్మగడ్డ రమేష్ రాష్ట్రంలో ఎన్నికల వాయిదాకు కేంద్రం ఆరోగ్య శాఖ నుండి సూచనలు తీసుకోవటం ఏమిటి ? రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత గురించి తెలుసుకోవాల్సింది రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో అన్న విషయం నిమ్మగడ్డకు తెలీదా ? పైగా  తాను సమాచారం కావాలని కోరితే వైద్య శాఖ అధికారులు స్పందించలేదని ఆరోపించారు. ఇది కూడా అబద్ధమని తేలిపోయింది. ఎందుకంటే ఆరోగ్య శాఖ అధికారులు స్పందిచకపోతే అదే విషయాన్ని ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేయాలి. ఆ పనిచేశారా ? లేదు. మొత్తం మీద ఒక ఉద్దేశంతోనే ఎన్నికలను వాయిదా వేసినట్లు నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరించిన తీరు బట్టి తెలుస్తుంది. మరోపక్క ఈ లెటర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసింది కాదని…సరికొత్తగా వార్తలు వస్తున్నాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాయకపోతే లెటర్ హెడ్ అన్ని ఆయనవే ఎలా ఉంటాయని టిడిపి నాయకులకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అమ్ముడు పోయాడా..? అంటూ తాజాగా వచ్చిన లెటర్ పై వైసీపీ నేతలు సంచలన కామెంట్ చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news