దానిమీదే ఆధార‌ప‌డుతున్న ష‌ర్మిల‌.. మిగ‌తా వాటి పరిస్థితేంటి..

ఒకనొక సంద‌ర్భంగా వై.ఎస్‌.ష‌ర్మిల‌ అంటే తెలంగాణ వ్య‌తిరేకిగా ముద్ర ప‌డ్డ వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి కూతురుగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె పూర్తిగా ఆంధ్రాకే చెందిన నాయ‌కురాలిగా ఇన్ని రోజులు రాజ‌కీయాలు చేశారు. ఆ త‌ర్వాత ఏమైందో ఏమో గానీ త‌న అన్న అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఆమె అనూహ్యంగా సైలెంట్ అయిపోయారు. ఇక ఏకంగా తెలంగాణ‌లో జెండాపాతేందుకు రెడీ అయిపోయారు. ఇక ఇప్పుడు ఆమె ఎంట్రీనే చాలామందికి విస్మ‌యం క‌లిగించింది. ఎందుకంటే ఆమెకు అస‌లు తెలంగాణ‌లో ప‌ట్టేలేదు.

ఇప్ప‌డు ఆమె చేస్తున్న ప్ర‌య‌త్నం ఎలా ఉందంటే ఎడారిలో కొబ్బ‌రిబోండం కోసం దేవులాడిన‌ట్టు ఉందంటూ వాద‌న‌లు వ‌స్తున్నాయి. కాగా ఆమె మీద ఇప్ప‌టికీ కూడా ఆంధ్రా ముద్ర ఎంతో ప్ర‌భావం చూపుతోంది. ఇక ఇలాంటి ప్ర‌భావం ఉన్నంత వ‌ర‌కు ఆమెను తెలంగాణ ప్ర‌జ‌లు ఆక్సెప్ట్ చేయ‌ర‌నేది అంద‌రికీ విదిత‌మే. ఇక ఇలాంటి ప‌రిస్థితుల్లో ఆమె తెలంగాణకు చెందిన మ‌హిళ‌నే అని నిరూపించుకునేందుకు ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఇక ఆమె ఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టి నుంచి ప్ర‌ధాన ఎజెండాగా నిరుద్యోగాన్ని ఎంచుకోవ‌డం చూస్తున్నాం. అయితే దీనికోసం దీక్ష‌లు, నిర‌స‌న‌లు కూడా బాగానే చేస్తున్నారు. అయితే దీన్ని త‌ప్ప ఆమె రాష్ట్రంలో జ‌రుగుతున్న ఏ పరిణామాలపై కూడా పెద్ద‌గా స్పందించ‌ట్లేదు. క‌నీసం విమ‌ర్శ‌లు కూడా చేయ‌ట్లేదు. రాష్ట్రంలో ఇత‌ర స‌మ‌స్య‌లు ఎన్ని ఉన్నా కూడా వాటిపై ష‌ర్మిల పెద్ద‌గా స్పందించ‌కుండా కేవ‌లం నిరుద్యోగాన్ని ఎజెండాగా చేసుకున్నారు. ఇక్క‌డే ఆమెకు ఇత‌ర వ‌ర్గాల్లో ఆద‌ర‌ణ త‌గ్గిపోయేలా చేస్తోంది. రాజ‌కీయాల్లో నెగ్గుకు రావాలంటే అన్ని స‌మ‌స్య‌ల‌పై వెంట వెంట‌నే స్పందిస్తూ అవ‌స‌ర‌మైతే నిర‌స‌న‌లు కూడా తెలపాలి. కానీ ష‌ర్మిల మాత్రం అలా చేయ‌కపోవ‌డ‌మే ఆమెకు పెద్ద మైన‌స్‌గా మారింది.