మెద‌క్‌పై ఫోక‌స్ పెట్టిన ష‌ర్మిల‌.. ఆ మంత్రి టార్గెట్‌?

తెలంగాణ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టి నుంచి కేసీఆర్‌పై ఘాటువిమ‌ర్శ‌లు చేస్తున్నారు ష‌ర్మిల‌. ముఖ్యంగా నిరుద్యోగ‌లు స‌మ‌స్య‌ల‌ను బేస్ చేసుకుని విమ‌ర్శ‌ల‌కు దిగుతున్నారు. ఖ‌మ్మంలో బ‌హిరంగ స‌భ పెట్టి, ఆ త‌ర్వాత నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష‌.. ఇలా వ‌రుస‌గా హంగామా చేశారు. కానీ క‌రోనా కార‌ణంగా పెద్ద‌గా బ‌య‌ట తిర‌గ‌ట్లేదు. కానీ ఇప్పుడు తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్బంగా జూన్ 2 మెద‌క్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు.

 

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజున షర్మిల తొలిసారిగా గన్ పార్క్ వద్దకు వెళ్తున్నారు. అక్క‌డ అమ‌ర వీరుల‌కు నివాళి అర్పించి, అక్క‌డి నుంచి నేరుగా మెదక్ జిల్లా పర్యటనకు షర్మిల బయలుదేరనున్నారు. ఇక తన పార్టీ కార్యాచరణను సైతం రెగ్యులర్ గా జరిగేలా షర్మిల ప్లాన్ చేసుకుంటున్నారు.

మెద‌క్‌లో హ‌రీశ్‌రావుపై దృష్టి పెట్టిన‌ట్టు తెలుస్తోంది. ఆత్మ‌హ‌త్య చేసుకున్న నిరుద్యోగ కుటుంబాల‌ను ఆమె ప‌రామ‌ర్శించ‌నున్నారు. అలాగే వైఎస్ అభిమానుల‌న కూడా క‌లిసే అవ‌కాశం ఉంది. ఇక వైఎస్ఆర్ పుట్టిన తేదీ జూలై 8న కావడంతో అదేరోజు పార్టీ ఏర్పాటు చేయాలని షర్మిల నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. పార్టీ పేరు. ‘యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి తెలంగాణ పార్టీ(వైఎస్సార్ టీపీ)’ గా రిజిస్ట్రేషన్ కు పంపినట్లు లోటస్ పాండ్ వర్గాలు ఇప్ప‌టికే వెల్లడించాయి.