కేసీఆర్ ఇలాఖానే టార్గెట్ చేస్తున్న ష‌ర్మిల‌.. ఎఫెక్ట్ చూపిస్తారా..

ఇప్పుడు తెలంగాణలో నిరుద్యోగుల త‌ర‌ఫున పోరాటం చేస్తూ త‌న ప్ర‌భావం చూపించాల‌ని అనుకుంటున్న ష‌ర్మిల‌కు మాత్రం ఇక్క‌ట్లు త‌ప్ప‌ట్లేదు. నిరుద్యోగ యువతకు భరోసా కల్పించేందుకు షర్మిల దీక్షలకు దిగుతున్నా కూడా పెద్ద‌గా ప్ర‌భావం అయ‌తే క‌నిపించ‌ట్లేదు. అయినా కూడా త‌న పంతం వ‌ద‌ల‌కుండా ప్రతి మంగళవారం కూడా నిరుద్యోగ దీక్షల‌తో హోరెత్తిస్తున్నారు. ఇక ఈ క్ర‌మ‌లోనే తెలంగాణలోని అన్ని జిల్లాలను ఇప్ప‌టి వ‌ర‌కు చుట్టేస్తున్న ష‌ర్మిల ఇప్ప‌డు మ‌రో సంచ‌ల‌నానికి తెర‌లేపారు. ఏకంగా కేఈసార్ ఇలాకానే టార్టెట్ చేస్తున్నారు.

ఇందులో భాగంఆ రేపు అన‌గా మంగళవారం కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉంటున్న నియోజకవర్గం గజ్వేల్ లో షర్మిల అడుగు పెట్ట‌బోతున్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఆమె దీక్ష‌కు దిగ‌బోతున్నారు. అస‌లు కేసీఆర్ నియోజకవర్గంలో ఎవ్వ‌రు కూడా వ్య‌తిరేకంగా పోరాడేందుకు సాహ‌సించ‌రు. కానీ ఇప్పుడు షర్మిలకు దీక్షకు దిగేంత‌గా అండ‌గా నిలుస్తున్న ఆ నిరుద్యోగి కుటుంబ స‌భ్యులు ఎవ‌రో అంతు చిక్క‌కుండా ఉంది.

కాగా ఓ విష‌యం మాత్రం అర్థ‌మ‌వుతోంది. అదేంటంటే గజ్వేల్ నియోజకవర్గంలోని అనంతరావుపల్లిలో ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకున్న కొప్పురాజు ఇటి వ‌ద్ద షర్మిల త‌న దీక్ష కొన‌సాగించ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ఇక ఇందుకోసం వైఎస్ఆర్ టీపీ కార్యకర్తలు భారీగా వ‌చ్చి విజ‌య‌వంతం చేయాల‌ని సూచిస్తున్నారంట‌. ఇప్ప‌టికే కార్య‌క‌ర్త‌లు కూడా దీక్షకు కావాల్సిన ఏర్పాట్లను కంప్లీట్ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. కేసీఆర్ ఇలాకాలో దీక్ష చేస్తే ఏమ ఏర‌కు ప్ర‌భావం చూపుతుందో అని అంతా చ‌ర్చించుకుంటున్నారు.