బెంగాల్ ఉప ఎన్నికల్లో బిజెపికి చావు దెబ్బ…! చుక్కలు చూపించిన మమత…!

-

బెంగాల్ లో ఎలాగైనా అధికార౦ చేపట్టాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీకి ఊహించని షాక్ తగిలింది… ఉప ఎన్నికల్లో అధికార తృణముల్ కాంగ్రెస్ పార్టీ హవా చూపించింది. బెంగాల్ లో అధికార పీఠం వైపు బిజెపి వేస్తున్న అడుగులకు మమత ఆదిలోనే చెక్ పెట్టడం గమనార్హ౦. వివరాల్లోకి వెళితే మూడు అసెంబ్లీ స్థానాలకు కలియాగంజ్, ఖరగ్‌పూర్ సదర్, కరీంపూర్ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల్లో మమత నాయకత్వంలోని తృణముల్ కాంగ్రెస్ తన హావా కొనసాగించింది.

కలియాగంజ్ ఉపఎన్నికలో టీఎంసీ అభ్యర్థి తపన్ దేబ్ సింఘా బిజెపి అభ్యర్ధి కమల్ చంద్ర సర్కార్‌పై 2,304 ఓట్ల తేడాతో విజయం సాధించి సత్తా చాటారు. ఆది నుంచి ఆయన ఆధిపత్యం కొనసాగించినా మధ్యలో బిజెపి హవా కొనసాగింది. చివరకు రెండు వేల ఓట్లతో ఆయన విజయం సాధించారు. ఇక ఖరగ్‌పూర్ సదర్ నియోజకవర్గంలో టీఎంసీ అభ్యర్థి ప్రదీప్ సర్కార్ 20,811 ఓట్ల ఆధిక్యంతో బిజెపి అభ్యర్ధిపై విజయం సాధించారు. ఇక కరీంపూర్ నియోజకవర్గంలో కూడా తృణముల్ కాంగ్రెస్ భారి విజయం సాధించి బిజెపికి చెక్ పెట్టింది.

ఈ మూడు స్థానాల్లో బిజెపికి చావు దెబ్బ తగలడంతో మమతా బెనర్జీ హర్షం వ్యక్తం చేసారు. బిజేపిని ప్రజలు ఏ స్థాయిలో వ్యతిరేకిస్తున్నారో చెప్పడానికి ఈ ఎన్నికలు ఒక ఉదాహరణ అంటూ ఆమె వ్యాఖ్యానించారు. గత కొన్నాళ్ళు బిజెపి మమతను టార్గెట్ చేసింది. ఇదిలా ఉంటే ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్ నియోజవర్గం ఉపఎన్నికలో మాత్రం బిజెపి ఓటమి నుంచి బయటపడింది. మధ్యాహ్నం 2 గంటల సమయానికి 1,800 ఓట్ల ఆధిక్యంలో ఉన్న ఆ పార్టీ విజయం సాధించడం దాదాపుగా ఖాయమైంది. కాగా బెంగాల్ లో పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి 17 స్థానాలు గెలిచిన సంగతి తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news