ఆదివారం కూడా వచ్చేసింది… కన్నా ఎక్కడ?

-

రాజకీయాల్లో ఆరోపణలూ ప్రత్యారోపణలూ మామూలే కానీ… ఈ రోజుల్లో, పైగా మీడియా, సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో ఈ రాజకీయ ఆరోపణలు… ఆ ఇద్దరు నేతల మధ్య మాత్రమే ఉండటం లేదు.. అవి జనాల్లోకి వెళ్లిపోతున్నాయి. ఈ సమయంలో ఆయా నాయకుల క్రెడిబిలిటీ విషయంలో ఇవి చాలా కీలక భూమిక పోషిస్తున్నాయి. ఈ విషయంలో ఏమాత్రం కాస్త తేడా కొట్టినా “కార్టూన్” అయిపోతారు! తాజాగా ఒక భారీ ఆరోపణలు ఏపీ రాజాకీయాల్లో చోటుచేసుకున్నాయి. అదే… ఏపీ బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ.. ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పై చేసిన ఆరోపణలు!

ఇటీవల కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై వరుస పెట్టి ఆరోపణలు చేస్తున్న కన్నా లక్ష్మీనారాయణ… అందులో భాగంగా ఏపీ మంత్రి బుగ్గన మీద భారీ ఆరోపణలే చేశారు. కరోనా పరీక్షల కిట్లను కొరియానుంచి పెద్ద ఎత్తున తెప్పించటం.. వాటి నాణ్యత మీద రచ్చ సాగటం తెలిసిందే. ఆ సమయంలో.. కరోనా కిట్లను తెప్పించిన ఆ కంపెనీలో బుగ్గన డైరెక్టర్ గా ఉన్నట్లుగా కన్నా ఆరోపించారు. ఈ ఆరోపణ రాజకీయ వర్గాల్లో షాకింగ్ గా మారింది. టీడీపీ చేసిన పనులే వైకాపా కూడా చేస్తుందా అనే అనుమానాలు తలెత్తాయి. ఇంతలోనే తన మీద బురదేసిన కన్నాకు ఊహించని రీతిలో భారీ సవాలు విసిరారు బుగ్గన.

కిట్లను సరఫరా చేసిన కంపెనీలో తాను డైరెక్టర్ గా ఉన్నట్లుగా కన్నా లక్ష్మీనారాయణ నిరూపించాలని.. అలా నిరూపించిన పక్షంలో శనివారం ఉదయం తొమ్మిది గంటలకు తాను తన మంత్రిపదవికి రాజినామా చేస్తానని భారీ ఛాలెంజ్ విసిరారు. బుగ్గన నోటి నుంచి అంతటి సీరియస్ వ్యాఖ్య వస్తే.. కన్నాలాంటి వారు తమ క్రెడిబిలిటీ కాపాడుకోవడానికి అంతకు మించిన అవకాశం ఏమి ఉంటుంది? కాకపోతే… బుగ్గన విసిరిన ఆ రేంజ్ ఛాలెంజ్ కి ఇంత హడావిడి చేసిన కన్నా మౌనంగా ఉండిపోవటం గమనార్హం. దాంతో… విజయసాయి రెడ్డి ఆరోపిస్తున్నట్లుగా.. చంద్రబాబు ఆడించినట్లుగా కన్నా లక్ష్మీనారాయణ ఆడుతున్నారనే విమర్శలకు బలం చేకూరింది.

ఇలాంటి పసలేని చిల్లర ఆరోపణలు చేస్తే.. నేటి రాజకీయాల్లో ఇలా “రాజకీయ కార్టూన్”లుగా మారిపోతారని కన్నాకు తెలిసివచ్చి ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇకనైనా ఇలాంటి చిల్లర ఆరోపణలు మానుకోవాలని… రాజకీయ నాయకులు హుందాగా వ్యవహరించడం నేర్చుకోవాలని అంతా కోరుకుంటున్నారు. ఈ విషయంలో బుగ్గన ఊరుకున్నా.. సోషల్ మీడియా నెటిజన్లు ఊరుకుంటారా… ఆదివారం కూడా వచ్చేసింది.. ఈపాటికి బుగ్గన మాజీ మంత్రి అయ్యీ ఒక రోజు గడిచేది… శుక్రవారం అయిపోయింది.. శనివారం అయిపోయింది.. ఆదివారం కూడా వచ్చేసింది.. కన్నా ఎక్కడ? అని ఆన్ లైన్ వేదికగా కన్నాతో ఆడుకుంటున్నారు!

Read more RELATED
Recommended to you

Latest news