మళ్లీ యాక్టివ్ అవుతున్న సోము వీర్రాజు

-

ఏపీ బీజేపీ మాజీ చీఫ్ సోము వీర్రాజు మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి వస్తున్నారు.ఆయన సన్నిహిత వర్గాల నేతలు కూడా అవుననే అంటున్నారు.పురందేశ్వరికి ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలిచ్చాక సైలెంట్ అయిన సోము వీర్రాజు ఎక్కడా పార్టీ కార్యక్రమాల్లో కనిపించలేదు.అధ్యక్ష పదవి నుంచి తొలగించాక అసంతృప్తిగా ఉన్న సోము వీర్రాజు టీడీపీలోకి వెళ్తారని టాక్ కూడా నడిచింది అప్పట్లో.అయితే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు సోము వీర్రాజు. తాజాగా పార్టీ కార్యాలయాల ప్రారంభం విషయంలో కీలక ప్రకటనలు చేస్తూ తెరపైకి వస్తున్నారు. బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ చేయబోతోందని అందుకే అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఆఫీసులు ప్రారంభిస్తున్నామని చెప్పుకొస్తున్నారు.

ఏపీలో భారతీయ జనతా పార్టీ పుంజుకుంటున్న నేపథ్యంలో సోము వీర్రాజు మళ్లీ తెరముందుకు రావడం పట్ల ఆ పార్టీలోని నేతలు కూడా కాస్త ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. బీజేపీ ఏమైపోయినా పర్వాలేదు కానీ జగన్ రెడ్డికి చిన్న నష్టం జరగకూడదన్న పాలసీని సోము వీర్రాజు ఇంకా కంటిన్యూ చేస్తారని ఆయన వైపు అనుమానంగా చూస్తున్నారు.పొత్తుపై బీజేపీ హైకమాండ్ ఇంకా తేల్చని నేపథ్యంలో ఏపీలో ఒంటరిగానే పోటీ చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం.సోము వీర్రాజు కూడా ఒంటరి పోరే కోరుకుంటున్నారు. జనసేనతో పొత్తు ఉంది మొర్రో అని పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. జనసేన కోటాలో టీడీపీ కేటాయించే సీట్లులో కొన్ని బీజేపీకి ఇస్తారని ఆశపడుతున్నారు కాబట్టి ఆ పొత్తుల ప్రకటనలు ఆపడం లేదు. కానీ సోము వీర్రాజుకు అది కూడా ఇష్టం లేదు కనుక సొంతంగా పోటీ చేయాల్సిందేనని రంగంలోకి దిగిపోయారు.

పొత్తులు ఉంటే పురందేశ్వరి రాజమండ్రి నుంచి అసెంబ్లీకి పోటీ చేయవచ్చన్న ప్రచారం కొంత కాలంగా జరుగుతోంది. ఈమేరకు ఆమె కార్యాచరణ కూడా మొదలుపెట్టినట్లు సమాచారం.ఇప్పుడు ఆయన రాజమండ్రి లో రంగంలోకి దిగిపోయారు. రాజమండ్రి బీజేపీకి బాహుబలిని తానేనని చెప్పుకునేందుకు వెంటనే పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ ఆఫీసులు ప్రారంభించేశారు. వీర్రాజు హడావుడి చూసి ఆ పార్టీ నేతలు కూడా ఆశ్చర్యానికి లోనవుతున్నారు. రాజమండ్రి నుంచి బీజేపీ తరపున ఎంపీ అభ్యర్థిగా వీర్రాజు పోటీ చేస్తున్నారేమో అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.దీనిపై క్లారిటీ రావాలంటే మరి కొద్దిరోజులు వేచి చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news