ఎవరిని అడిగి ఓకే చేశారు…? అంతా మీ ఇష్టమేనా…? సోనియా ఫైర్…?

-

రాజకీయాలు ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయో అర్ధం కానీ పరిస్థితి నెలకొంది. గత మూడు వారల నుంచి దోబూచులాడుతున్న అధికార లక్ష్మి కోసం గంటకో పార్టీ బయటకు వస్తుంది. రాష్ట్రపతి పాలన విధించక ముందు తాము అధికారం చేపడతామని చెప్పిన శివసేన ఆ తర్వాత పరిణామాలతో వెనక్కి తగ్గింది. రాష్ట్రపతి పాలన అనంతరం బిజెపిలోకి మూడు పార్టీల ఎమ్మెల్యేలు, ఇతరులు కలిపి దాదాపుగా 40 మంది వరకు చేరే అవకాశం ఉందనే ప్రచారం పెద్ద ఎత్తున చేశారు. ఇక మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కూడా తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చేసిన ప్రకటన,

 

ఆ వెంటనే స్పందించిన శివసేన చేసిన ప్రకటన జనాన్ని అయోమయంలోకి నెట్టాయి. అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆసక్తికి పోయి ఆ రాజకీయం గురించి మాట్లాడాలి అంటేనే విసిగిపోయి పరిస్థితి కల్పించారు. ఇక ఇది పక్కన పెడితే శుక్రవారం ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని వార్తలు వచ్చాయి. ఆ మూడు పార్టీల మధ్య అంగీకారం జరిగిందని, శివసేనకు అయిదేళ్ల పాటు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి రెండు పార్టీలు అంగీకారం తెలిపాయని వార్తలు రావడంతో ప్రభుత్వ ఏర్పాటు జరగడం ఖాయమని అందరూ భావించారు.

ఈ తరుణంలో మహారాష్ట్రలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మహారాష్ట్ర కాంగ్రెస్ లీడర్లపై అసహనం వ్యక్తం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటు తనను అడగకుండా చేస్తున్నారని, మీరు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారని ఆమె వారిపై మండిపడ్డారు. ప్రస్తుతం సోనియా మహారాష్ట్ర లీడర్లకు అందుబాటులో లేరని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆమె శివసేనకు 5 ఏళ్ళ పాటు ముఖ్యమంత్రి పీఠం ఇచ్చే విషయంలోనే అసహనం వ్యక్తం చేశారని, తమకు కాకపోయినా ఎన్సీపీకి కూడా ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని సోనియా డిమాండ్ చేస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news