బ్రేకింగ్: తెలంగాణా మంత్రులకు స్పీకర్ షాక్…!

తెలంగాణ అసెంబ్లీలో మంత్రులకు చురకలు అంటించారు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. సభలో కోవిడ్ రూల్స్ పాటించని మంత్రులు ఈటెల – జగదీష్ రెడ్డిలపై ఆయన నేరుగానే అసహనం వ్యక్తం చేసారు. సభా సమయంలో ఈటెల పక్కన ఉన్న నో- సీటింగ్ ఛైర్ లో కూర్చున్న మంత్రి జగదీష్ రెడ్డిపై మండిపడ్డారు. మంత్రులను గమనించిన స్పీకర్ నో- సీటింగ్ సీట్ లో కూర్చోవద్దని మంత్రికి సూచించారు.

ఇలాంటివి జరగకుండా చూడాలని, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంది అని ఆయన హెచ్చరించారు. దీనితో వెంటనే మంత్రి జగదీష్ రెడ్డి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు. సభలో సభ్యులందరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని స్పీకర్ పోచారం అందరికి సూచించారు. కాగా తెలంగాణాలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు కరోనా బారిన పడ్డారు.