సుజనా చౌదరి.. ఇంతకీ ఏ పార్టీలో ఉన్నట్టో..?

-

సుజనా చౌదరి.. రాజకీయాల్లోకి వచ్చిన పారిశ్రామిక వేత్త.. తెలుగు దేశం పార్టీకి మొదటి నుంచి ఆర్థికంగా అండదండలదించిన వ్యక్తి.. ఆ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆర్థికంగా ఆదుకున్న వ్యక్తిఆ కృతజ్ఞతతోనే చంద్రబాబు ఆయన్ను రెండు సార్లు ఎంపీగా చేశారుఓసారి ఏకంగా కేంద్రమంత్రినే చేశారు.

తెలుగు దేశంలో సుజనా చౌదరి వంటి కార్పోరేట్లుకు ప్రాధాన్యం ఇస్తున్నారని చాలామంది సిసలైన నాయకులు పార్టీకి దూరమైనా కూడా చంద్రబాబు వీరికి బాగానే ప్రయారిటీ ఇచ్చారుకానీ అలాంటి సుజనా చౌదరి మొన్నటి ఎన్నికల తర్వాత అనూహ్యంగా బీజేపీ పంచన చేరారుఅనుకోని షాక్ ఇచ్చారుఅయితే ఇదంతా చంద్రబాబు ఆడిస్తున్న నాటకమే అని.. కొందరు విశ్లేషిస్తుంటారు.

తెర వెనక వ్యవహారాలు ఎలా ఉన్నా.. ఇప్పుడు సుజనా చౌదరి బీజేపీ నాయకుడుకానీ పార్టీ మారిన తర్వాత కూడా సుజనా చౌదరి వ్యవహారశైలి టీడీపీ నాయకుడిలాగానే ఉంటోంది తప్పించి బీజేపీ వ్యక్తిలా ఉండటం లేదన్న విమర్శలు బాగా వస్తున్నాయిప్రత్యేకించి ఆయన చేసే విమర్శలన్నీ కూడా టీడీపీ వాదనలే కావడం విశేషం.

రాజధాని అమరావతి విషయంలోనూ.. పోలవరం టెండర్ల విషయంలోనూ.. పీపీఏల విషయంలోనూ.. ఇలా ఏ విషయం చూసుకున్నా సుజనా చౌదరి అచ్చనైన టీడీపీ నాయకుడిలాగానే మాట్లాడుతున్నారుగతంలో పోలవరంపై బీజేపీ ఎన్నో విమర్శలు చేసిందిచంద్రబాబు అడ్డంగా దోచుకుంటున్నారని మాట్లాడిందికానీ ఇప్పుడు సుజనా చౌదరి మాత్రం రివర్స్ టెండరింగ్ ను వ్యతిరేకిస్తున్నారుఇవన్నీ చూస్తే ఇంతకీ సుజనా చౌదరి టీడీపీనా.. బీజేపీనా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version