కరోనా విషయం లో సూపర్ డూపర్ గుడ్ న్యూస్ !

-

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ వల్ల భూమి మీద ఉన్న ప్రభుత్వాలు మరియు అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. చాలా వరకు ముందస్తు జాగ్రత్తలు సూచనలు ఇస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ ప్రస్తుతం భూమి మీద ఉన్న అన్ని ఖండాలలో వ్యాపించి ఉంది. ఎక్కువగా ఇటలీ దేశంలో ఈ వైరస్ వల్ల చాలామంది చనిపోవడం జరిగింది. దానికి కారణం చూస్తే ఇటలీ దేశంలో ఎక్కువగా వృద్ధులు ఉండటంతో … ఒంటిలో వ్యాధి నిరోధక శక్తి లేకపోవడంతో అంత మంది మరణించినట్లు వైద్యులు చెబుతున్నారు. Image result for caroona virusఇదిలా ఉండగా ఈ వైరస్ వల్ల భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలకు సూపర్ డూపర్ గుడ్ న్యూస్ ఇటీవల ఒకటి ఇంటర్నేషనల్ స్థాయిలో వినబడుతోంది. అదేమిటంటే భూమి మీద బతుకుతున్న మనిషి ని వణికిస్తున్న  కరోనా వైరస్ కు రెండు మందులను గుర్తించినట్లు ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌ విశ్వవిద్యాలయంకు చెందిన శాస్త్రవేత్తలు తెలియచేసారు. ఈ రెండు మందులలో ఒకటి హెచ్ఇవి కోసం మరొకటి మలేరియా కోసం వాడుతున్నామని.. పరిశోధనలో ఇవి వైరస్ ను సమర్ధవంతంగా అడ్డుకోగలిగాయని.. సెంటర్‌ ఫర్‌ క్లినికల్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ డేవిడ్‌ పాటర్సన్‌ తెలిపారు.

 

మందును రోగిపై ప్రయత్నించగా మంచి రిజల్ట్స్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ఈ మందు పై మరికొన్ని పరిశోధనలు చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆస్ట్రేలియా వైద్యులు ప్రయోగాలు చేస్తున్నారు. మరోపక్క అమెరికా మరియు ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు కూడా ఈ వైరస్ కి సంబంధించి వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకు రావడానికి ప్రయోగాలు చేస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news