తమ అనుమతి లేకుండా… తమ పేరుతో సర్వేను ప్రకటించడం చట్టరిత్యా నేరమని… ఆంధ్రజ్యోతి పేపర్ లో ప్రచురించబడిన సర్వేపై కఠిన చర్యలు తీసుకుంటామని సర్వే సంస్థ వెల్లడించింది. అసలు.. ఆ సర్వేకు తమకు ఎటువంటి సంబంధం లేదన్నది.
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అడ్డంగా దొరికిపోయారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న కసితో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు ఎలా అడ్డదారులు తొక్కుతున్నారో తేటతెల్లమైంది. తన మిత్రుడు రాధాకృష్ణతో కలిసి తెర లేపిన ఫేక్ సర్వేల గుట్టు రట్టయింది. ఫేక్ సర్వేలో.. ఏపీలో టీడీపీదే అధికారం అని ఆంధ్రజ్యోతి పేపర్ లో వచ్చిన ఓ కథనంపై సీఎస్ డీఎస్ లోక్ నీతి సర్వే సంస్థ స్పందించింది.
ఆంధ్రజ్యోతి పేపర్ లో వచ్చినట్టుగా తాము ఇంతవరకు ఏపీలో ఎటువంటి సర్వే నిర్వహించలేదని స్పష్టం చేసింది. దీంతో ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రచురించిన సర్వే ఫేక్ అని తేలిపోయింది.తమ అనుమతి లేకుండా… తమ పేరుతో సర్వేను ప్రకటించడం చట్టరిత్యా నేరమని… ఆంధ్రజ్యోతి పేపర్ లో ప్రచురించబడిన సర్వేపై కఠిన చర్యలు తీసుకుంటామని సర్వే సంస్థ వెల్లడించింది. అసలు.. ఆ సర్వేకు తమకు ఎటువంటి సంబంధం లేదన్నది.
చంద్రబాబు అండ్ కో కలిసి వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవడం కోసం ఎన్ని కుయుక్తులకు పాల్పడుతున్నారో దీని ద్వారా అర్థమయిపోతున్నది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ పై కావాలని బురద జల్లే విధంగా పచ్చ పత్రికలు రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే.
ఇలాంటి ఎన్ని అసత్యపు ప్రచారాలు చేసినా.. బూటకపు సర్వేలు చేసినా వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలవడం ఖాయమని.. ఇటువంటి బూటకపు సర్వేలు చేసుకొని చంద్రబాబు తన గోతిని తానే తీసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.