అర‌కులో ఫ్యాన్ గాలి….వైసీపీకి అనుకూలంగా స‌ర్వేలు

-

ఉమ్మడి విశాఖప‌ట్నం జిల్లాలోని అరకు వ్యాలీ నియోజ‌క‌వ‌ర్గంలో ఈసారి కూడా ఫ్యాన్‌కు అనుకూల వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది.రానున్న ఎన్నిక‌ల్లో ఇక్క‌డ వైసీపీ అభ్య‌ర్ధి విజ‌య‌కేత‌నం ఎగ‌రువేసే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి.పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా ప్రస్తుతం ఈ నియోజకవర్గ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంది. 2009లో పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గం ఏర్పాటైంది. ఇప్పటి వరకు జరిగిన మూడు ఎన్నికల్లో ఒకసారి తెలుగుదేశం పార్టీ, రెండుసార్లు వైసిపి అభ్య‌ర్దులు విజయం సాధించారు.ఈ నియోజకవర్గంలో 1,87,357 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష వాటర్ లో 91,412 మంది,మహిళా ఓటర్లు 95,934 మంది ఉన్నారు.ఇక్క‌డ మ‌హిళా ఓట‌ర్లే ప్ర‌తిసారి న్యాయ‌నిర్ణేత‌లుగా మారుతున్నారు.

2009లో ఏర్ప‌డిన ఈ నియోజ‌క‌వ‌ర్గంలో అదే ఏడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్ధి విజ‌యం సాధించారు.ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సివేరి సోమ విజయం సాధించారు.కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కాంతమ్మపై 402 ఓట్ల తేడాతో ఆయ‌న గెలిచారు.ఇక 2014లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ విజయం సాధించింది. వైకాపా నుంచి పోటీ చేసిన కిడారి సర్వేశ్వరరావు విజయాన్ని దక్కించుకున్నారు. టిడిపి నుంచి పోటీ చేసిన శివేరి సోమపై 34,053 ఓట్ల తేడాతో సర్వేశ్వరరావు గెలుపొందారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా పోటీ చేసిన శెట్టి ఫల్గుణ విజ‌య‌కేత‌నం ఎగ‌రువేశారు.ఇండిపెండెంట్ అభ్య‌ర్ధి దొన్ను దొరపై 25,441 ఓట్ల తేడాతో శెట్టి ఫల్గుణ విజ‌యం సాధించారు.నాలుగో ఎన్నిక‌కు సిద్ధ‌మైన అర‌కు వ్యాలీలో ఈసారి వైసీపీ,టీడీపీ అభ్య‌ర్ధుల న‌డుమ ఆస‌క్తిక‌ర పోరు న‌డ‌వ‌నుంది.

రానున్న ఎన్నికల్లో ఇక్క‌డ పోటీ చేసే అభ్య‌ర్ధిపై సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క‌స‌ర‌త్తు చేస్తున్నారు.ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గమైన అరకులో వైసీపీ బలంగా ఉంది. గడిచిన రెండు ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లోను వైసీపీ విజయమే ల‌క్ష్యంగా అభ్యర్థిని బరిలోకి దించేందుకు సిద్ధమవుతోంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన దొన్ను దొర బలమైన నేత కావడంతో.. వైసీపీ అధిష్టానం అందుకు అనుగుణంగానే బలమైన అభ్యర్థిని బరిలోకి దించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని అభ్యర్థిని ఎంపిక చేసే పనిలో అధినాయకత్వం ఉంది. వైసీపీ నుంచి 5 మంది నేత‌లు ఈ సీటును ఆశిస్తున్నారు.త్వ‌ర‌లోనే వైసీపీ అభ్య‌ర్ధిపై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news