ఏదైనా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం వీక్ గా ఉన్నా.. కీలకంగా వ్యవహరించకపోయినా.. రెండో ప్రతిపక్షం ఆ అవకాశాన్ని సువర్ణావకాశంగా మలుచుకుని ముందుకు దూసుకుపోయే ప్రయత్నం చేయడం అత్యంత సహజం. పైకి ఎంత కలిసి ఉన్నట్లు నటించినా, నిలిచినా కూడా.. ఎక్కడైనా బావ కానీ వంగతోట కాడ కాదన్నట్లుగా… రాజకీయాలు చేసుకుంటూ పోవాలి! ఈ విషయంలో పవన్ కు టీడీపీ అవకాశాలు కల్పించినా వాడుకోలేదనేది జనసైనికుల ఆవేదన కాగా… పవన్ పనులకు టీడీపీ కార్యకర్తలు సంతోషపడుతున్నారట!
తాను అధికారం చేపట్టినప్పటినుంచీ ప్రతిపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు జగన్! ఈ క్రమంలో కరోనా రావడం కొన్ని ఇబ్బందులు ఎదురవడం, అనంతరం విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ వ్యవహారం వంటివి ప్రతిపక్షాలు వాటి మనుగడ కాపాడుకోవడానికి రాజకీయంగా అవకాశం ఉన్న సంఘటనలు!! ఈ క్రమంలో టీడీపీ కానీ జనసేన కానీ ప్రజలు హర్షించే స్థాయిలో ఈ రెండు విషయాలపైనా కనస్ట్రక్టివ్ పాలిటిక్స్ చేయడంలో విఫలమయ్యాయి. ఆ సంగతులు అలా ఉంటే… దొంగలు పడ్డ ఆరు నెలల తర్వాత అయినా తాజాగా ఏపీకి వెళ్లి విశాఖ బాదితులను పరామర్శించాలని బాబు రిక్వస్ట్ పెట్టుకున్నారు!
నిన్న మొన్నటివరకూ తన స్థాయి జాతీయ స్థాయి అన్నట్లు ఫీలయ్యి మోడీని పర్మిషన్ అడిగి అబాసుపాలయిన బాబు… తాజాగా మళ్లీ రాష్ట్ర ప్రభుత్వాలనే రిక్వస్ట్ చేసుకున్నారు! ఈ క్రమంలో 70ఏళ్లు దాటిన బాబు కాస్త కరోనా భయాన్ని పక్కన పెట్టి సాహసం చేయగలిగారు కానీ… 48 ఏళ్ల పవన్ మాత్రం ఇప్పటికీ ఇంట్లో నుంచి బయటకు రావడం లేదని కామెంట్లు మొదలైపోయాయి! దీంతో మా బాబే లేట్ అనుకున్నాం.. పవన్ బాబు మరీ లేట్ అని తెగ హ్యాపీ ఫీలయిపోతున్నారట తెలుగు తమ్ముళ్లు! తనకు కష్టం వస్తే అంతా కలిసి ఉండాలి కానీ… తనకు కంఫర్ట్ గా ఉంటే మాత్రం ఒక్కరే తనదారి తాను చూసుకుంటారనే విమర్శ బాబుపై ఉంది! సరిగ్గా ఈసారి కూడా పవన్ విషయంలో అదే జరిగిందని మరో రకం విశ్లేషణ!
ఏది ఏమైనా… కరోనా కారణమో, మోడీ అనుమతి ఇవ్వలేదనే సాకో, 70ఏళ్లు దాటిన వయసులో రిస్క్ ఎందుకనే ఆలోచనో కానీ… కారణం ఏదైనా బాబు ఇప్పటికైనా ఒకసారి అలా విశాఖ వెళ్లి వద్దామని భావించారు కానీ… పవన్ మాత్రం ఇంకా కరోనా భయం నుంచి బయటకు రావడం లేదు!! బాబు పద్ధతితో విసుగెత్తిన టీడీపీ కార్యకర్తలు మాత్రం… తాజాగా పవన్ పద్దతికి కాస్త హ్యాపీ ఫీలవుతున్నారట.